కూతురితో ఘనంగా క్రిస్మస్ జరుపుకున్న చరణ్ ఉపాసన…ఫోటోలు వైరల్!

డిసెంబర్ 25వ తేదీ క్రిస్మస్( Christmas ) పండుగ కావడంతో ప్రతి ఒక్కరు కూడా కుల మతాలకు అతీతంగా ఈ పండుగను జరుపుకున్నారు.

ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్నట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే సినీ సెలెబ్రెటీలు వారి క్రిస్మస్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) ఇంట్లో కూడా ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయని తెలుస్తోంది.

ఇందుకు సంబంధించిన ఫోటోలను ఉపాసన( Upasana ) సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

"""/" / ప్రస్తుతం ఉపాసన రాంచరణ్ విడిగా ఉంటున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ఉపాసన తన ఇంట్లో క్రిస్మస్ ట్రీ ఏర్పాటు చేసి తన ఇంటి పని వారితో కలిసి ఎంతో ఘనంగా ఈ వేడుకను జరుపుకున్నారు.

తాజగా ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు ఇలా పని వాళ్ళ అందరితో కలిసి ఉపాసన రాంచరణ్ తన కుమార్తె క్లిన్ కార( Klin Kaara ) తో కలిసి ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఇలా ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ రామ్ చరణ్ ఉపాసన మంచి మనసు పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

"""/" / సాధారణంగా ఇలాంటి వేడుకలు కుటుంబ సభ్యులు అలాగే ఇతర సెలబ్రిటీలను ఆహ్వానించి జరుపుకుంటారు.

కానీ రామ్ చరణ్ ఉపాసన మాత్రం తన ఇంట్లో పని చేసే వారిని తన ఫ్యామిలీగా భావించి వారితో ఇలా క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకోవడం అంటే నిజంగా చాలా గ్రేట్ అని వీరి మనసు చాలా మంచిది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇక ఈ ఫోటోలలో కూడా క్లీన్ కార ఉన్నప్పటికీ తన ఫేస్ కనపడకుండా ఉన్నటువంటి ఫోటోలను మాత్రమే ఉపాసన షేర్ చేయడం గమనార్హం.

ఒకప్పుడు సైడ్ ఆర్టిస్ట్… ఇప్పుడు మాత్రం క్రేజీ హీరోయిన్. ఈ బ్యూటీ ఎవరో మీకు తెలుసా?