చరణ్ తో పాటు రైమ్ కి దక్కిన అరుదైన గౌరవం.. సంతోషంలో ఫ్యాన్స్!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న వారిలో రామ్ చరణ్( Ramcharan ) ఒకరు.

చిరంజీవి వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన చరణ్ తనకంటూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు.

పాన్ ఇండియా స్టార్ హీరోగా, గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ సొంతం చేసుకున్నారు.

కెరియర్ పరంగా నటన విషయంలో తండ్రికి మించిన తనయుడు అని గుర్తింపు పొందిన చరణ్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతూ ఉన్నారు.

"""/" / ఇకపోతే ఇటీవల చరణ్ ఓ అరుదైన గౌరవాన్ని అందుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు హీరోల మైనపు విగ్రహాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

అయితే త్వరలోనే రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు మేడం టుస్సాడ్స్ ( Madam Tussauds )ఇటీవల వెల్లడించింది.

అయితే తాజాగా ఈ మైనపు విగ్రహానికి సంబంధించి మరో విషయాన్ని వెల్లడించారు.ఇటీవల అబుదాబిలో జరిగిన ఐఫా అవార్డు( IIFA Awards ) వేడుకలు జరిగిన సంగతి తెలిసిందే.

"""/" / ఈ అవార్డు వేడుకలలో భాగంగా మేడం టుస్సాడ్స్ మ్యూజియం వాళ్ళు రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం గురించి తెలియజేయడమే కాకుండా రామ్ చరణ్ తో పాటు తన పెట్ రైమ్ మైనపు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు అధికారకంగా ప్రకటించారు.

ఇలా చరణ్ తో పాటు రైమ్ కూడా ఈ గౌరవాన్ని అందుకోవడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మేడం టుస్సాడ్స్ మ్యూజియం టీమ్ చరణ్, రైమ్ ల కొలతలు, ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు.

ఈ వీడియోలో చరణ్ మాట్లాడుతూ.మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో నా మైనపు విగ్రహం పెట్టడం గర్వంగా భావిస్తున్నాను.

త్వరలోనే మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో కలుద్దాం అని అన్నారు.ఇక ఈ విగ్రహాన్ని సింగపూర్ మేడం టుస్సాడ్స్ మ్యూజియం బ్రాంచ్ లో చరణ్, రైమ్ మైనపు విగ్రహం పెట్టనున్నారు.

ఇప్పటికే టాలీవుడ్ హీరోలైన మహేష్ బాబు ప్రభాస్ అల్లు అర్జున్ విగ్రహాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

సెల్ఫీ దిగుతూ నీటిలో కొట్టుకుపోయిన యువతి.. 12 గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత?