ఆ హీరో అంటే నాకు చాలా ఇష్టం ఆయనతో నటించడానికి రెఢీ…
TeluguStop.com
ఇప్పుడు ఉన్న జనరేషన్ కి హీరోయిన్ రంభ అంటే తెలియకపోవచ్చు కానీ ఈమె నటించిన సినిమాలు చూస్తే ఓహో ఈ హీరోయినేనా అంటూ ఆశ్చర్యపోతారు.
గతంలో హీరోయిన్ రంభకి ఎంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండేదంటే తన సినిమాలతో తన పర్ఫామెన్స్ తో ఇండస్ట్రీ లో దుమ్ము లేపుతుందో ఆ విధంగానే రంభ( Rambha ) కూడా గతంలో తన అంద చందాలతో టాలీవుడ్ ని ఒక ఊపు ఊపింది.
చిరంజీవి లాంటి అగ్ర హీరో సరసన కూడా రెండు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
మరీ ముఖ్యంగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన బొంబాయి ప్రియుడు( Bombay Priyudu ) సినిమాలో ఈమె నటన అమోఘం.
ఇక గతంలో చిరంజీవికి పోటీగా డ్యాన్స్ చేసిన హీరోయిన్ రాధ తర్వాత రంభనే సెకండ్ ప్లేస్ లో ఉంటుంది.
ఇక హీరోయిన్ రంభ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన యమదొంగ సినిమాలో కూడా ఐటెం సాంగ్ చేసింది.
అలాగే ఎందరో స్టార్ హీరోల సరసన నటించి కేవలం టాలీవుడ్ లోనే కాకుండా మిగతా ఇండస్ట్రీలో కూడా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
"""/" /
మరి ముఖ్యంగా భోజ్పురిలో ఈమెకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది.
అలాంటి ఈ ముద్దుగుమ్మ పెళ్లయిన తర్వాత సినిమాలకు దూరంగా ఉంది.అయితే గతంలో ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న రంభ ఛాన్స్ వస్తే భర్తతో గొడవపడైనా సరే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను.
అంటూ ఒక విషయాన్ని బయట పెట్టింది. """/" /
అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రంభ మాట్లాడుతూ.నాకు జూనియర్ ఎన్టీఆర్( Jr Ntr ) డాన్స్ అంటే చాలా ఇష్టం.
అలాగే ఒక్కసారైనా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి నటించే ఛాన్స్ వస్తే బాగుండు అనేది నాకు ఉన్న కల.
ఒకవేళ ఆ ఛాన్స్ వస్తే మాత్రం అస్సలు ఊరుకోను.ఈ విషయంలో నా భర్తతో గొడవ పెట్టుకొని అయినా సరే ఆ సినిమాలో నటిస్తాను అంటూ రంభ ఓ ఇంటర్వ్యూలో చెప్పినా మాటలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
ఎందుకంటే రంభ చిరంజీవితో కూడా నటించింది ఇక వాళ్ల కొడుకు సినిమా లో కూడా ఏ చిన్న పాత్ర దొరికిన నటిస్తాను అని చెప్పడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.
చూడాలి మరి ముందు ముందు సినిమాల్లో రంభ రామ్ చరణ్ తో నటిస్తుందో లేదో.
ధనుష్ నయనతార వివాదంలో త్రివిక్రమ్.. పూనమ్ కౌర్ పోస్ట్ చూస్తే షాకవ్వాల్సిందే!