ఒంటరి మహిళకు ఇంటిని నిర్మించిన విద్యార్థులు.. పిల్లలపై పలువురి ప్రశంసల వర్షం..!
TeluguStop.com
రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు కొట్టగలం.అందరూ ఐకమత్యంగా ఉంటే ఏదైనా సాధించగలం.
ఒంటరిగా చేయలేని పనులు అందరూ కలిస్తే క్షణాల్లో పూర్తి అవుతాయి.ఇలాంటి మాటలు చాలానే విని ఉంటాం.
కానీ ఇలాంటి పనులు చేయాలంటే ఎంతో గొప్ప మనసు ఉండాలి.అలా తమ గొప్ప మనసును చాటుకున్నారు రామవరం గ్రామ మోడల్ స్కూల్ విద్యార్థులు.
( Ramavaram Model School ) సొంత ఇల్లు లేని ఒంటరి మహిళకు 12 రోజులు శ్రమించి సొంత ఇంటిని నిర్మించి ఇచ్చి అందరి ప్రశంసలు పొందుతున్నారు.
జనగం జిల్లా కొడకండ్ల మండలం రామవరం గ్రామంలో మోడల్ స్కూల్లో చదివే విద్యార్థులు ( Students )అదే గ్రామంలో సొంత ఇల్లు లేని సలీమా ( Saleema ) అనే ఒంటరి మహిళకు ఇంటిని నిర్మించి ఇచ్చారు.
నిజంగా విద్యార్థులు కూలీలుగా, మేస్త్రీలుగా అవతారం ఎత్తి ఇంటి నిర్మాణం చేయడం చిన్న విషయం ఏమి కాదు.
పిల్లల సేవా గుణం పై అందరూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. """/" /
ఇటీవలే ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ సభ్యులు చేస్తున్న సేవా కార్యక్రమాలపై టీవీ9 కథనాలను ప్రసారం చేసింది.
ఇందులో భాగంగా సూర్యాపేట జిల్లా మిర్యాలగూడ మోటార్ సైకిల్ ఇన్ స్పెక్టర్ గంట రవీందర్ చేతుల మీదుగా ఆ ఇంటి నిర్మాణం ప్రారంభమైంది.
ఈ విషయం తెలిసిన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆ ఒంటరి మహిళకు సహాయం చేశారు.
అంతటితో ఆగకుండా వారి గ్రామాలలో కూడా సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. """/" /
ఈ విషయాలు తెలిసిన రామవరం మోడల్ స్కూల్ విద్యార్థులు రాత్రి పగలు అనే తేడా లేకుండా కూలీలుగా, మేస్త్రీలుగా మారి 12 రోజులు శ్రమించి ఇంటి నిర్మాణం పూర్తి చేశారు.
ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ తో ఓ మహిళకు ఇంటిని నిర్మించి ఇచ్చి ఆమె కన్నీళ్లను తుడిచి తమ గొప్ప మనసు చాటుకున్నారు ఈ మోడల్ స్కూల్ విద్యార్థులు.
ఈ ఇంటి నిర్మాణానికి లక్ష రూపాయలు ఖర్చు అయింది.ఆ ఒంటరి మహిళకు గృహప్రవేశం చేయించడంతోపాటు రూ.
15000 ఆర్థిక సహాయం అందించారు.ఇంత గొప్ప మనసు చాటుకుని అందరి ప్రశంసలు పొందుతున్నారు.
అమ్మలా ప్రేమను పంచాడు.. నన్ను నెత్తిన పెట్టుకున్నాడు.. విష్ణుప్రియ కామెంట్స్ వైరల్!