ఏఎన్నార్ చేత డ్యుయెల్ రోల్ చేయించిన రామానాయుడు..

రామానాయుడు.తెలుగు సినిమా పరిశ్రమలో మూవీ మొఘల్ గా గుర్తింపు తెచ్చుకున్న నిర్మాత.

ఎన్నో అద్భుత సినిమాలను ఆయన నిర్మించాడు.అక్కినేని నాగేశ్వర్ రావు తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర నటుడిగా కొనసాగిన యాకర్ట్.

ఎన్నో ఎపిక్ సినిమాల్లో నటించాడు ఏఎన్నార్.ఈ ఇద్దర లెజెండ్స్ వియంకులు.

నాగేశ్వర్ రావు కొడుకు నాగార్జునకు, రామానాయుడు కూతురు లక్ష్మీతో 1984లో వివాహం జరిగింది.

కొంత కాలం తర్వాత వీరిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు రావడంతో ఆరేండ్ల వ్యవధిలోనే విడిపోయారు.

అయినా ఇరు కుటుంబాల మధ్య ఎలాంటి విబేధాలు రాలేదు.ఎప్పటి మాదిరిగానే కొనసాగారు.

అటు రామానాయుడు, నాగేశ్వర్ రావు వియంకులు కాకముందే ఇద్దరు కలిసి ఎన్నో సినిమాలు చేశారు.

ఏఎన్నార్ హీరోగా పలు సినిమాలను నిర్మించాడు.వీరిద్దరు కాంబినేషన్ లో 1969లో సిపాయి చిన్నయ్య అనే సినిమా తెరకెక్కింది.

అక్కినేని ఇందులో ద్విపాత్రాభినయం చేశాడు.ఈ సినిమా కంటే ముందే రామానాయుడు నిర్మించిన రాముడు-భీముడు సినిమాలో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ చేశాడు.

ఇద్దరు టాప్ హీరోలతో డ్యుయెల్ రోల్ చేయించిన నిర్మాత రామానాయుడు.సిపాయి చిన్నయ్య సినిమాకు శేషగిరిరావు దర్శకత్వం వహించారు.

ఈ సినిమా కొంత బ్లాక్ అండ్ వైట్ లో మరికొంత కలర్స్ లో తెరకెక్కించారు.

ఈ సినిమాలో కెఆర్ విజయ, భారతి నటీమణులుగా చేశారు. """/"/ అటు ఈ సినిమాలో ఎల్ విజయ లక్ష్మి చేసిన ఓ పాటు మస్త్ హిట్ అయ్యింది.

ఇప్పటికే పలు సినిమాల్లో డ్యాన్సర్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది విజయలక్ష్మీ.

ఈ సినిమాలో ఒరే మావా.ఏసుకోరా సుక్క అనే ఆరుద్ర పాట‌కు స్టెప్పులతో అదరగొట్టింది.

నిజానికి ఈ సినిమాలో ఆమె అనుకోకుండా నటించింది.అప్పటికే సినిమాల్లో నటించనని చెప్పి విదేశాలకు వెళ్లిపోయింది.

తన బంధువుల ఇంట్లో పెళ్లి కోసం మద్రాసుకు వచ్చింది.రామానాయుడు ఈ సినిమా ఓ పాట చేయాలని కోరడంతో.

ఆయన మీదున్న గౌరవంతో ఈ సినిమాలో ఆడిపాడింది విజయ లక్ష్మీ.ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది.

ఎన్టీఆర్, నీల్ కాంబో మూవీ బ్యాక్ డ్రాప్ ఇదేనా.. భారీ రిస్క్ కు సిద్ధమయ్యారుగా!