Ramajogayya Sastry: ప్రతివాడు మాట్లాడేవాడే.. కుక్కలు.. రామజోగయ్యశాస్త్రి సంచలన వ్యాఖ్యలు వైరల్!

టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గుంటూరు కారం.

( Guntur Karam ) ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో శ్రీ లీల( Sreeleela ) హీరోయిన్గా నటిస్తోంది.ఇది ఇలా ఉంటే ఈ సినిమా నుంచి తాజాగా ఓ మై బేబీ ( Oh My Baby Song ) అనే పాట విడుదలైన విషయం తెలిసిందే.

ఈ పాట ఒక వర్గం ప్రేక్షకులను మెప్పించగా ఒక వర్గం ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు.

దాంతో థమన్ మళ్లీ తన పాత ట్యూన్‌నే కాస్త మార్చేసి ఇచ్చారని, ఇక రామజోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్ అయితే అస్సలు బాగోలేవని సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టారు.

తెలుగు లిరిక్స్ కాకుండా ఈ ఇంగ్లిష్ లిరిక్స్ ఏంటని తిట్టిపోశారు.కొందరు అయితే నేరుగా రామజోగయ్య శాస్త్రి, థమన్, నిర్మాత సూర్యదేవర నాగవంశీలను ట్యాగ్ చేసి మరీ బూతులు తిట్టారు.

ఇక ట్రోలర్స్( Trollers ) అయితే నిన్నటి నుంచీ అదే పని మీద ఉన్నారు.

దీంతో లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రికి( Ramajogayya Sastry ) ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

సోషల్ మీడియాలో వచ్చి ఆ కామెంట్స్ పై ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు.

ఇలా ఇష్టమొచ్చినట్టు బూతులు తిడుతూ కామెంట్లు పెడుతున్నవారిపై ఆయన విరుచుకుపడ్డారు.ఈ మేరకు ఆయన స్పందిస్తూ.

సోషల్ మీడియా కుక్కల చేతుల్లోకి వెళ్లిపోతోంది.ప్రాసెస్ గురించి ఒక్క ముక్క కూడా తెలియదు ఈ జనాలకు.

"""/" / అది తెలిసినవాళ్లే కామెంట్ చేయగలరు.జడ్జ్ చేయగలరు.

దురుద్దేశంతో కావాలని పనిగట్టుకుని ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారు.టెక్నీషియన్ లను టార్గెట్ చేస్తున్నారు.

ఇది ఎట్టిపరిస్థితుల్లోనూ మంచిది కాదు.ఎవరో ఒకరు మాట్లాడాలి.

గీతలు దాటుతున్నారు వీళ్లు అని ఒక నెటిజన్ పరుష పదజాలంతో చేసిన కామెంట్‌కు రామజోగయ్య శాస్త్రి రిప్లై పోస్ట్ పెట్టారు.

ఆ తర్వాత మరో పోస్ట్ కూడా చేశారు.ప్రతివాడు మాట్లాడేవాడే.

రాయి విసిరే వాడే.అభిప్రాయం చెప్పేదానికి ఒక పద్ధతి ఉంటుంది.

"""/" / పాట నిడివి తప్ప నిన్నటి పాటకు ఏం తక్కువయ్యిందని, మీకన్నా ఎక్కువ ప్రేమే మాక్కూడా.

అదే లేకపోతే.ప్రేమించకపోతే మా పని మేం గొప్పగా చెయ్యలేం.

తెలుసుకొని ఒళ్ళు దగ్గరపెట్టుకుని మాట్లాడండి.అని ఘాటుగా పేర్కొన్నారు రామజోగయ్య శాస్త్రి.

సక్రమంగా అభిప్రాయాన్ని తెలియజేయాలని.పద్ధతి మీరకండని శాస్త్రి హెచ్చరించారు.

ఫీడ్‌బ్యాక్ తీసుకోవడానికి తానెప్పుడూ సిద్ధమేనని పేర్కొన్నారు.అయితే, రామజోగయ్య శాస్త్రి వ్యాఖ్యల పట్ల మహేష్ బాబు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తన చేతివంటను రుచి చూపించిన నాగ చైతన్య.. వీడియో వైరల్