రంజాన్ పండుగ ఒక కానుక.. రంజాన్ గురించి మాటల్లో చెప్పాలంటే..?

ఈద్ పండుగ( Eid Festival ) అంటే నెలరోజుల ఆరాధన ఫలించే సమయం.

అలాగే పవిత్రమైన రంజాన్( Ramadan ) నెలవంక కనిపించిన తర్వాత ప్రారంభమవుతుంది.

ఇక ఆ మాసం అంతా సాగుతుంది.రంజాన్ మాసం ముగిసి నెలవంక కనిపించిన తర్వాత ఈ పండుగ నమాజ్ తో ముగుస్తుంది.

ఈద్ అంటే కరుణామయుడైన అల్లాకు కృతజ్ఞతలు తెలియజేయడం.అలాగే ఆయన ప్రసాదించిన వరాలను గుర్తించడం.

అంతేకాకుండా ఆయన అనుగ్రహానికి ధన్యవాదాలు తెలుపుకోవడం.అయితే ఈద్-ఉల్-ఫితర్( Eid-ul-Fitr ) పర్వదినాన పొద్దున్నే నిద్ర లేచి కాల కృత్యాలు తీర్చుకోవాలి.

అలాగే ఫజర్ నమాజ్ కచ్చితంగా చేయాలి.ఇక తలంటు స్నానం చేసి, మంచి దుస్తులు ధరించాలి.

ఇక నమాజ్ కన్నా ముందే జకాత్, ఫిత్ర, దానాలు చేయాలి.ఇక నమాస్ కు వెళ్లి వచ్చిన తర్వాత తీపి పదార్థాన్ని తీసుకోవాలి.

ఒకటి, మూడు, ఐదు, ఏడూ ఇలా బేసి సంఖ్యలో ఖర్జూర పండ్లను కూడా తినాలి.

"""/" / అంతేకాకుండా ఈద్గా మైదానానికి ఒక దారిలో వెళ్లి వచ్చేటప్పుడు మరో మార్గంలో రావాలి.

అయితే ఈద్ నమాజ్ కు వెళ్తున్న సమయంలో తక్బీర్ ను మెల్లగా పలుకుతూ ముందుకు సాగాలి.

అయితే కాలినడకన ఈద్గా కు వెళ్తే చాలా పుణ్యం లభిస్తుంది.ఆ రోజు పిల్లలకు ఈది కూడా ఇవ్వాలి.

అంతేకాక బంధువుల ఇళ్లకు వెళ్లి శుభాకాంక్షలు కూడా తెలపాలి.అంతేకాకుండా ఇరుగుపొరుగు వారిని ఇంటికి ఆహ్వానించి తీపి పదార్థాలు ఇవ్వాలి.

అంతేకాకుండా నమాజ్ లో అల్లాహ్ కు కృతజ్ఞతలు చెప్పాలి.ఇక ఆ రోజంతా సంతోషంగా గడపాలి.

ఇక పండుగ నమాజ్ ను ఇరుకైనా జనవాసాల్లో కాకుండా విశాలమైన బహిరంగ ప్రదేశాల్లో చేయడం చాలా మంచిది.

అంతేకాకుండా దైవ ప్రవక్త మహమ్మద్ సాంప్రదాయం ప్రకారం ఈ విధంగా నమాజ్ చేయాలి.

ఈద్గా సమీపంలో లేకపోతే స్థానిక పెద్ద మసీదులలో ఈద్ నమాజ్ కచ్చితంగా చదవాలి.

వైరల్ వీడియో : లారీ రూపంలో విద్యార్థి మృత్యువు ..