భారత చైతన్య యువజన పార్టీ… ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన బోడే రామచంద్ర యాదవ్( Bode Ramachandra Yadav ) గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వద్ద నిర్వహించిన సింహ గర్జన మహాసభలో తను రాష్ట్రంలో నూతన రాజకీయ పార్టీని ప్రకటించారు.

ఆదే భారత చైతన్య యువజన పార్టీ( BCYP) అని పార్టిపేరు ను వెల్లడించారు.

వేదిక మీద ఆయన మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో 85% జనాభాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ అణగారిన వర్గాల వారే ఉన్నారని వారి అభివృద్ధి ఏ పార్టీకి పట్టడం లేదని, వీరంతా అభివృద్ధి చెందాలన్న , రాజకీయ స్వాతంత్రం కావాలన్న రాష్ట్రంలో మరో రాజకీయ పార్టీ అవిర్బావం అవసరమని వాఖ్యానించారు.

రాష్ట్రంలో రైతు పరిస్థితి బాగుండాలన్నా,యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నా, రాజకీయ, సామాజిక స్వాతంత్రం ఉండాలన్నా , వారసత్వ రాజకీయాలకు స్వస్తి చెప్పాలని, కుటుంబ పాలన నుండే బయటకు రావాలని హత్య దోపిడి రాజకీయాలకు స్వస్తి పలకాలని ఆయన వాక్యానించారు, తమ పార్టీని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.

ఈ సభకు అంబేద్కర్ మనువడు అంబేద్కర్, సూరజ్ మండల్, పలువురు బీసీ సంఘాల నేతలు హాజరైనారు.

ఆలియా నా జీవితంలో చాలా స్పెషల్… రణబీర్ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?