ఒకదానిపై ఒకటి ప్రేమ చూపించుకుంటున్న రామ చిలుకలు

చాలా మందికి చిలుకలు అంటే అమితమైన ఇష్టం.అయితే చిలకలలో ఎన్నో రకాలు ఉంటాయి.

వాటిలో టియా రకానికి చెందిన చిలుక చాలా తెలివైన పక్షులుగా పరిగణించబడుతుంది.అవి మానవ స్వరాలను కూడా అనుకరించగలవు.

అంతేకాకుండా అనేక స్వరాలను అనుకరిస్తాయి.అచ్చం మనుషులు మాట్లాడినట్లే అవి కూడా మాట్లాడడంతో వాటిని చూసే ప్రజలు ఆశ్చర్యపోతారు.

కొన్ని నెలల క్రితం, అటువంటి చిలుక వీడియో వైరల్ అయ్యింది.వాటి స్వరాన్ని విన్నప్పుడు ఏది నిజమైనదో, ఏది చిలుక గొంతో మీరు చెప్పడం కష్టం.

అనేక ఇతర రకాల చిలుకలను అనుకరించే వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.

ఇటీవల రోజుల్లో అలాంటి ఒక వీడియో సంచలనం సృష్టించింది.ఇందులో రెండు చిలుకలు ముద్దు పెట్టుకోవడం అందులో ఉంది.

దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.బ్యూటెంగెబిడెన్ అనే ట్విట్టర్ ఖాతాలో రెండు చిలుకలు 'ముద్దు' పెట్టుకున్న వీడియో నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది.

ఆ వీడియోలో రెండు చిలుకలు ఒకదానిపై మరొకటి ప్రేమను చూపించుకుంటున్నాయి.వాటిలో ఒకటి తల వెనుక భాగంలో దాని ముక్కుతో మరొక చిలుకను ముద్దాడుతుంది.

అచ్చం మనుషుల్లా మాట్లాడుతూ దాని ప్రేమను తెలియజేస్తోంది.ఆ చిలక ఇలా ఒకసారి కాదు, చాలా సార్లు చేసింది.

ఇలా చాలాసార్లు ఒకదానికొకటి ముద్దుపెట్టుకుని శబ్దాలు చేస్తాయి.ఇద్దరు మనుషులు ఒకరినొకరు ముద్దుపెట్టుకున్నప్పుడు ఎలాంటి శబ్దాలు వస్తాయో అవి కూడా అలాంటి శబ్దాలే చేశాయి.

ఈ వీడియో సోషల్ మీడియాలో పెట్టగానే నెటిజన్లు ఆశ్చర్యపోయారు.అవి నిజంగానే మనుషులను బాగా అనుకరించాయని పేర్కొంటున్నారు.

అవి తెలివైన చిలుకలని, వాటిని పెంచుకోవాలని ఉందని ఇంకొందరు ఆసక్తి కనబర్చారు.

వైసీపీ నేతల మొర ఇప్పటికైనా జగన్ ఆలకిస్తారా ?