లింగుస్వామి కనిపించకుండా ప్రమోషన్ చేస్తున్నారేం!

రామ్‌ హీరోగా నటించిన ది వారియర్‌ సినిమా ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ వారంలో విడుదల నేపథ్యంలో పబ్లిసిటీ హడావుడి కనిపిస్తుంది.ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి ఈ సినిమా లో హీరోయిన్‌ గా కనిపించబోతుంది.

కనుక అంచనాలు భారీ గా ఉన్నాయి.ఇప్పటి వరకు ఆమె నటించిన సినిమా లన్నీ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

కనుక ఈ సినిమా సెంటిమెంట్‌ ప్రకారం హిట్‌ అంటున్నారు.ఇదే సమయంలో సినిమా కు దర్శకత్వం వహించిన లింగు స్వామి గురించి మీడియాలో ముఖ్యంగా తెలుగు మీడియా లో చాలా తక్కువ గా వినిపిస్తుంది.

తమిళంలో ఈ సినిమా ను లింగు స్వామి దర్శకత్వం చేశాడు అంటూ ప్రచారం చేస్తున్నారు.

కాని తెలుగు లో మాత్రం ఆయన పేరును ప్రముఖంగా చెప్పడం లేదు.తెలుగు లో పెద్ద హీరోలు మరియు స్టార్‌ హీరోలు గతంలో లింగు స్వామి దర్శకత్వంలో సినిమా లు చేయాలనుకున్నారు.

కాని కొన్ని కారణాల వల్ల సినిమా లు వర్కౌట్‌ అవ్వలేదు.లింగు స్వామి గత కొంత కాలంగా ప్లాప్ లతో సహవాసం చేస్తున్నాడు.

ఆ ప్లాప్ లు ఇప్పుడు టాలీవుడ్‌ పై ప్రభావం చూపిస్తున్నాయి.ఆయన దర్శకత్వంలో సినిమా అంటే ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో అర్థం కాక పోవడంతో మేకర్స్ సినిమా ను లింగు స్వామి ఎక్కువగా కనిపించకుండా ప్రమోషన్ చేస్తున్నట్లుగా మీడియా లో చర్చ జరుగుతోంది.

నిజంగానే సినిమా పాజిటివ్‌ గా ఉంటే తప్పకుండా మంచి వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉంటే అప్పుడు లింగు స్వామి గురించి పెద్ద ఎత్తున పబ్లిసిటీ దక్కే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు.

ఇక్కడ తదుపరి సినిమాల గురించి ఆయన ది వారియర్ విడుదల తర్వాత చర్చించే అవకాశాలు ఉన్నాయి.

వైరల్ వీడియో: ఆసుపత్రిలో డాన్స్ చేస్తున్న వినోద్ కాంబ్లీ