రామ మందిరానికి విదేశీ విరాళాలు: కేంద్రం అనుమతి కోరిన రామజన్మభూమి ట్రస్ట్

అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి భూమి పూజ పూర్తి అయ్యింది.భవ్య మందిర నిర్మాణంలో ఉడత భక్తిగా ప్రతీ ఒక్కరు ఎంతో కొంత విరాళం ఇవ్వాలని అనుకోవడం సహజం.

ఇలాంటి పరిస్థితిలో, ప్రతి ఒక్కరూ కూడా ఇందులో సహకరించాలని కోరుకుంటారు.ఇందుకు తగ్గట్టుగానే ఎందరో భక్తులు రామ జన్మభూమి ట్రస్ట్‌కు విరాళాలు అందజేస్తున్నారు.

ఈ నేపథ్యంలో రామ మందిర నిర్మాణానికి విదేశాల నుంచి విరాళాలను స్వీకరించడానికి అనుమతించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్రం ట్రస్ట్.

రామాలయ నిర్మాణానికి ఎన్ఆర్ఐలు, విదేశీయులు విరాళాలు పంపడం ప్రారంభించారని ట్రస్ట్‌కు చెందిన ఓ అధికారి వెల్లడించారు.

దీనిలో భాగంగా మంగళవారం ట్రస్ట్ కార్యాలయానికి భారత సంతతికి చెందిన అమెరికన్ పౌరుడు 1,500 డాలర్ల చెక్ పంపినట్లు ఆయన చెప్పారు.

ఎన్ఆర్ఐలకు సౌకర్యంగా ఉండేందుకు గాను ట్రస్ట్ త్వరలోనే ఎన్ఆర్ఐ ఖాతా తెరవనుందని, ఈ అకౌంట్‌లో విదేశీ కరెన్సీ జమ చేసుకోవచ్చునని ఆ అధికారి వెల్లడించారు.

"""/"/ ప్రతిష్టాత్మకమైన ఈ ఆలయ నిర్మాణానికి ఈ ఏడాది ఆగస్టు 5న ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన చేశారు.

నాటి నుంచి విరాళాల సంఖ్య రూ.75 కోట్లకు పెరిగాయని ట్రస్ట్ వెల్లడించింది.

విదేశాలలో ఉన్న వారు చెక్కుల రూపంలో విరాళాలు ఇస్తున్నారు.ఈ నేపథ్యంలో వీటిని పొందడంలో చట్టబద్ధంగా వున్న ఆటంకాలను తొలగించేందుకు గాను ట్రస్ట్ సిద్ధమైంది.

దీనిలో భాగంగా విదేశీ విరాళాలను స్వీకరించేందుకు భారత ప్రభుత్వ అనుమతి కోసం దరఖాస్తు చేసింది.

కేంద్రం నుంచి అనుమతి వచ్చిన వెంటనే రామ జన్మభూమి ట్రస్ట్.పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఎన్ఆర్ఐ ఖాతా తెరవనుంది.

రామ మందిరం కోసం భారత ప్రజలు రూ.11 నుంచి రూ.

11,000 వరకు నగదు రూపేణా విరాళాలు అందజేస్తున్నారు.అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం ట్రస్ట్ ఏర్పాటు చేశారు.

2020-21 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం అందులో విరాళాలపై పన్ను మినహాయింపు సైతం ఇచ్చింది.

దీనికి సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ (సిబిడిటి) మే రెండవ వారంలో నోటిఫికేషన్ విడుదల చేసింది.

కాగా, విదేశీ నిధులను స్వీకరించే ఎన్జీవోల రిజస్ట్రేషన్‌కు ఆధార్‌ను తప్పనిసరి చేసే బిల్లును లోక్‌సభ సోమవారం ఏకగ్రీవంగా ఆమోదించిన సంగతి తెలిసిందే.

దీని ప్రకారం.విదేశీ విరాళాలు అందుకునే ఎన్జీవోలు, ఇతర సంస్థల్లోని ఆఫీసు బేరర్లు, డైరెక్టర్లు తదితర కీలక వ్యక్తుల ఆధార్‌ నంబర్‌ను.

వారు విదేశీయులైతే పాస్‌పోర్ట్‌ ప్రతిని సమర్పించడం తప్పనిసరి.ఈ బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా తరపున హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఆదివారం సభలో ప్రవేశపెట్టారు.

వైరల్ వీడియో: ఏంటి భయ్యా.. బతికున్న నల్లత్రాచుకు నేరుగా పూజలు చేస్తున్న కుటుంబం..