పూరీ తో రామ్.. పనులు ఎక్కడిదాకా వచ్చాయంటే..?

ఇస్మార్ట్ శంకర్( ISmart Shankar ) సినిమాతో పూరీ జగన్నాథ్, రామ్ ఇద్దరు కలిసి సూపర్ హిట్ కొట్టారు.

పూరీ, రామ్ ఇద్దరికి ఆ సినిమా హిట్ మంచి కిక్ ఇచ్చింది.పూరీ మాత్రం ఇస్మార్ట్ శంకర్ తో తిరిగ్ ఫాం లోకి వచ్చాడని అనుకున్నారు అదే ఊపుతో లైగర్( Liger ) సినిమా తీస్తే అది కాస్త షాక్ ఇచ్చింది.

లైగర్ తర్వాత పూరీతో సినిమా అంటే బాబోయ్ అనేస్తున్నారు హీరోలు.ఈ క్రమంలో పూరీ మరోసారి రామ్( Ram Pothineni ) తో సినిమా లైనప్ చేసినట్టు టాక్ వచ్చింది.

రాం తోనే పూరీ సినిమా ఉండబోతుందని టాక్.అయితే ఈ సినిమా విషయంలో పూరీ పర్ఫెక్ట్ ప్లాన్ తో ఉన్నాడట.

రామ్ కూడా కథ దగ్గర నుంచి చాలా డీటైల్డ్ గా సినిమా మీద ఫోకస్ తో ఉండాలని చెప్పాడట.

అంతేకాదు సినిమాను చకచకా చుట్టేయకుండా అనుకున్న విధంగా వస్తుందా లేదా అన్నట్టుగా తీయాలని అనుకున్నారట.

పూరీ సినిమా అంటే తక్కువ పని రోజుల్లో సినిమా పూర్తవుతుంది.అయితే రామ్ తో సినిమా ను అలా కాకుండా కొద్దిగా టైం తీసుకుని అయినా హిట్ సినిమా చేయాలని పూరీ ఫిక్స్ అయ్యాడని తెలుస్తుంది.

అంబానీ ఫ్యామిలీపై చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఎంతో స్ఫూర్తిని పొందాం అంటూ?