రోజా మంత్రి కాకూడదని ఆ హీరోయిన్ దేవుడిని మొక్కుకున్నారా.. ఏమైందంటే?

బుల్లితెరపై సక్సెస్ ఫుల్ గా ప్రదర్శితమవుతూ మంచి రేటింగ్స్ ను సొంతం చేసుకుంటున్న షోలలో ఎక్స్ట్రా జబర్దస్త్ షో కూడా ఒకటి.

తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో రిలీజ్ ప్రోమో రిలీజ్ కాగా ప్రోమోలో ఎన్నెన్నో జన్మల బంధం సాంగ్ తో ఇమ్మాన్యుయేల్, వర్ష ఎంట్రీ ఇస్తారు.

ఇమ్మాన్యుయేల్ వర్షతో నిజం చెప్పు నువ్వు మగ కాదు అంటూ ఆమె పరువు తీసేశారు.

ఆ తర్వాత ఇంద్రజ బుల్లెట్ భాస్కర్ తో మీకు ఒక కో టీమ్ లీడర్ ఉండేవారని మీరు తొక్కేయడం వల్లే ఆయన జబర్దస్త్ నుంచి వెళ్లిపోయారని ఇంద్రజ ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు తాను స్పందించకూడదని అనుకున్నానని ఇప్పుడు కూడా ఎందుకు స్పందిస్తున్నానంటే వెళ్లిపోయిన వ్యక్తి పెద్దాయన అని ఆ రీజన్ వల్లే తాను స్పందిస్తున్నానని బుల్లెట్ భాస్కర్ చెప్పుకొచ్చారు.

ఆ తర్వాత ఇంద్రజ మీరు స్క్రిప్ట్ లు సరిగ్గా రాయకపోవడం వల్లే మీ టీం మెంబర్స్ వెళ్లిపోయారట నిజమా అని రామ్ ప్రసాద్ ను ప్రశ్నించారు.

ఆ ప్రశ్నకు రామ్ ప్రసాద్ సమాధానం ఇచ్చినట్టు ప్రోమోలో చూపించారు.ఆ తర్వాత రామ్ ప్రసాద్ నేను కూడా ఒక ఓన్ క్వశ్చన్ అడగొచ్చా అంటూ ఇంద్రజను రోజాగారు మినిష్టర్ కాకూడదని మీరు దేవుడిని కోరుకున్నారట? ఎందుకు? అని ప్రశ్నించారు.

అయితే ప్రోమో కోసమే వివాదాస్పద ప్రశ్నలు అడిగారా? లేదా? తెలియాలంటే ఈ నెల 17వ తేదీన ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఆగాల్సిందే.

ప్రోమో కింద సుధీర్ లేకుండా ఈ షోను చూడలేమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

"""/" / సుధీర్ ఎక్స్ట్రా జబర్దస్త్ షోకు తిరిగి వస్తారో లేదో చూడాల్సి ఉంది.

మల్లెమాల సంస్థతో అగ్రిమెంట్ ముగియడం వల్లే సుధీర్ ఈ షోకు గుడ్ బై చెప్పారని ఇకపై సుధీర్ ఈ షోలో కనిపించే అవకాశం దాదాపుగా లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఎక్స్ట్రా జబర్దస్త్ షోకు దూరం కావడం గురించి సుధీర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

1000 మంది స్టార్స్ కలిస్తే నా కొడుకు ప్రభాస్.. శ్యామలాదేవి కామెంట్స్ కు ఫిదా అవ్వాల్సిందే!