లవ్ మ్యారేజ్ చేసుకోనున్న హీరో రామ్.. అమ్మాయి ఆమే.. ముహూర్తం ఫిక్స్?

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.టాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించి హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా చాక్లెట్ బాయ్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు రామ్ పోతినేని.

ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో రామ్ పోతినేని కి సంబంధించిన వార్త తెగ చక్కర్లు కొడుతోంది.

అదేమిటంటేరామ్ పోతినేని త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడట.రామ్ పోతినేని తన చిన్ననాటి స్నేహితురాలు క్లాస్ మేట్ తో ప్రేమలో ఉన్నాడని, వీరిద్దరు గత కొంత కాలంగా ప్రేమలో మునిగితేలుతున్న ఈ జంట ఇరువురు కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోంది.

ఇకపోతే రామ్ పోతినేని నటించిన వారియర్ సినిమా జూలై 14 న విడుదల కానున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమా పై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత హీరో రామ్ పోతినేని తన ప్రేయసి తో కలిసి నిశ్చితార్థం చేసుకోనున్నాడట.

ఇక వారియర్ సినిమా విడుదలైన తర్వాత రామ్‌ ప్రేయసితో ఎంగేజ్‌మెంట్‌ జరగనుందట. """/" / పెళ్లి కూడా ఇదే ఏడాది చేసుకోనున్నారని సమాచారం.

కాగా గతంలో రామ్‌ పెళ్లి గురించి స్పందిస్తూ అది మన చేతుల్లో ఉండదని, పెళ్లనేది జరగాల్సిన సమయంలో జరుగుతుందన్నాడు.

ఇప్పుడా సమయం రానే వచ్చిందంటున్నారు ఫ్యాన్స్‌.అయితే కొందరు మాత్రం ఇది నిజం కాకపోవచ్చని కొట్టిపారేస్తున్నారు.

రామ్‌ పెళ్లి విషయంపై క్లారిటీ రావాలంటే అతడు స్పందించేవరకు వెయిట్‌ చేయాల్సిందే అని అంటున్నారు.

ఇకపోతే రామ్‌ నటించిన వారియర్‌ సినిమా తెలుగు, తమిళంలో రిలీజ్‌కు రెడీగా ఉంది.

తమిళ డైరెక్టర్‌ లింగుస్వామి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఉప్పెన బ్యూటీ కృతీ శెట్టి కథానాయికగా నటించింది.

ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపై ఇంతటి బరితెగింపా?