ఎనిమిదేళ్ల వయస్సులోనే హీరో కావాలనుకున్న రామ్.. ఆ భాషలో సినిమాలు చేయాలనుకున్నారా?
TeluguStop.com
తెలుగు ప్రేక్షకులకు హీరో రామ్ పోతినేని( Hero Ram Pothineni ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
తెలుగులో ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు రామ్ పోతినేని.
సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు.
ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు రామ్ పోతినేని.ఇది ఇలా ఉంటే తాజాగా హీరో రామ్ పోతినేని కి సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారింది.
అదేమిటంటే చిన్న వయసులోనే హీరోగా మారాడు రామ్ పోతినేని.అతడికి హీరోగా మారాలనే కోరిక చిన్న వయసులోనే కలిగిందట.
"""/" /
తాజాగా ఈ విషయాన్ని బయటపెట్టాడు రామ్.8 ఏళ్ల వయసులోనే హీరో అవుతానంటూ వెళ్లి తన తల్లికి చెప్పాడట రామ్.
ఇంట్లో ఆల్రెడీ నిర్మాత ఉన్నారు కాబట్టి హీరో అవ్వాలనే ఆలోచన రావడం సహజం అని అంతా అనుకున్నారట.
అయితే అది బ్యాక్ గ్రౌండ్ వల్ల వచ్చిన ఆలోచన కాదని, హీరో అవ్వాలనేది తన తపన అని రామ్ నిరూపించాలనుకున్నాడట.
అందుకే తమిళ్ లో సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాడట.అలా 11 ఏళ్ల వయసుకే తమిళ్ లో ఒక షార్ట్ ఫిలిం( A Short Film ) చేశాడు రామ్.
దానికి అవార్డులు కూడా వచ్చాయి.ఆ షార్ట్ ఫిలిం చూసిన వైవీఎస్ చౌదరి, దేవదాస్( YVS Chaudhary, Devdas ) కోసం రామ్ ను సెలక్ట్ చేశాడట.
"""/" /
అయితే అప్పటికే రామ్, హీరోగా తమిళ్ లో ఒక సినిమాకు కమిట్ అయ్యే ఆలోచనలో ఉన్నాడట.
ఆ ఆలోచనను బ్రేక్ చేసి, వైవీఎస్ చౌదరి తనను టాలీవుడ్ ( Tollywood
)కు తీసుకొచ్చారని చెప్పుకొచ్చాడు రామ్ పోతినేని.
అలా దేవదాస్ సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ పోతినేని ఆ తర్వాత తెలుగులో చాలా సినిమాలలో నటించి మెప్పించారు.
లవర్ బాయ్ గా మాస్ క్యారెక్టర్లలో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పాత్రల్లో నటించి బాగానే అభిమానులను సంపాదించుకున్నారు.
రాజమౌళి సినిమా కోసం 17 ఏళ్ల సెంటిమెంట్ బ్రేక్ చేసిన మహేష్ బాబు?