రెమ్యునరేషన్ విషయంలో రూట్ మార్చిన రామ్.. కొత్త మూవీకి ఆ హక్కులు తీసుకున్నారా?
TeluguStop.com
తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని ( Ram Pothineni )గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
రామ్ పోతినేని ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
కానీ ఆయన నటించిన సినిమాలు మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ ని అందుకోలేకపోతున్నాయి.
వరుసగా ఫ్లాపులు పలకరించాయి.దీంతో రామ్ కెరియర్ కాస్త ఇబ్బందుల్లో పడిందనే చెప్పాలి.
ఇటీవల విడుదలైన ఈ డబుల్ ఇస్మార్ట్( Double ISmart ) సినిమా కూడా అంతంతమాత్రంగానే ఉంది.
"""/" /
ఇకపోతే హీరో రామ్ పోతినేని సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోవడంతో రెమ్యూనరేషన్ విషయంలో నిర్మాతలు వెనక్కు తగ్గడం మొదలు పెట్టారట.
అయితే అందుకే ఇప్పుడు రెమ్యూనిరేషన్( Mahesh Babu P ) కు బదులుగా రెండు ఏరియాల పంపిణీ హక్కులు తీసుకునేందుకు వీలుగా దిగి వచ్చారు హీరో రామ్ పోతినేని.
హీరో రామ్ కు వరుస ఫ్లాపులే.నిర్మాతలు అంతా కుదేలు.
బయ్యర్లు అంతా దిగాలు.ఇలాంటి నేపథ్యంలో మిస్ శెట్టి దర్శకుడు మహేష్ తో మైత్రీ సంస్థ సినిమా ఆఫర్ వచ్చిందట.
అయితే ఎప్పటిలాగే సినిమాకు పాతిక కోట్లు రెమ్యునరేషన్ కావాలని చెప్పారట రామ్ పోతినేని.
"""/" /
కానీ మైత్రీ సంస్థ అలా అయితే తాము సినిమా ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్లడం కష్టం అని చెప్పినట్లు తెలుస్తోంది.
దాంతో వైజాగ్, నైజాం ఏరియాల పంపిణీ హక్కులు ఇవ్వమని రామ్ అడిగినట్లు తెలుస్తోంది.
రెండు కీలకమైన ఏరియాలు ఇవ్వలేమని, నైజాం ఇస్తామని, వైజాగ్ కాకుండా మరో ఏరియా ఏదైనా తీసుకోమని బేరం మొదలు కాగా, నైజాం, గుంటూరు ఏరియాలు తీసుకునేలా ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది.
అయితే ప్రస్తుతం రామ్ పోతినేని ఉన్న పరిస్థితులలో తన నెక్స్ట్ సినిమా సూపర్ హిట్ అయితే తప్ప తనకు సినిమా అవకాశాలు రావడం కష్టం అని చెప్పాలి.
క్రిస్మస్ రోజున స్వీపర్‌కి అనూహ్య బహుమతి.. వీడియో చూస్తే మీరూ కన్నీళ్లు పెట్టుకుంటారు!