రామ్ రాంగ్ సెలక్షన్..!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ లేటెస్ట్ మూవీ ది వారియర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

ఈరోజు రిలీజైన ఈ సినిమా ఫస్ట్ టాక్ మన తెలుగు రాష్ట్రాల నుంచి రావడం విశేషం.

మాములుగా అయితే ఏ సినిమాకైనా సరే ముందు రోజు యూఎస్ ప్రీమియర్స్ తో టాక్ బయటకు వచ్చేస్తుంది.

రివ్యూస్ కూడా యూఎస్ షోల ద్వారా ఇచ్చేస్తారు.కానీ రామ్ ది వారియర్ మాత్రం రిలీజ్ రోజు అది కూడా 9 గంటల తర్వాత తొలి ఆట పడ్డది.

అందుకే తెలుగు రాష్ట్రాల్లోనే మొదటి టాక్ బయటకు వచ్చింది.ఇక సినిమా విషయానికి వస్తే కోలీవుడ్ స్టార్ డైరక్టర్ లింగుసామి తన మార్క్ మాస్ ఎంటర్టైనర్ గా ది వారియర్ తెరకెక్కించారు.

కానీ సినిమాలో ఏమాత్రం కొత్తదనం లేదని ఆడియెన్స్ అంటున్నారు.రామ్ యాక్షన్, ఆది పినిశెట్టి విలనిజం ఆకట్టుకున్నా సరే కథలో మ్యాటర్ లేకపోవడంతో ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.

తాను ఎన్నో పోలీస్ కథలు విన్నాను కానీ ఈ కథ తనకు కనెక్ట్ అయ్యిందని రామ్ సినిమా గురించి ఓ రేంజ్ లో చెప్పాడు.

తీరా సినిమా చూస్తే అన్ని పాత చింతకాయ పచ్చడి స్టోరీల్లానే ది వారియర్ కథ కూడా ఉంది.

అయితే డాక్టర్ అయిన రామ్ విలన్ పని పట్టడం కోసం పోలీస్ గా మారతాడు.

బహుశా అక్కడ రామ్ లింగుసామికి లాక్ అయ్యి ఉండొచ్చు కానీ మిగతా సినిమా మొత్తం తెలిసిన కథనే రొటీన్ స్క్రీన్ ప్లేతోనే తెరకెక్కించారు.

రామ్ ది వారియర్ చూసిన ఆయన ఫ్యాన్స్ రామ్ రాంగ్ సెలక్షన్స్ ని చెప్పేస్తున్నారు.

అయితే మాస్ ఆడియెన్స్ కి ఈ సినిమా మంచి ఎంటర్టైన్ మెంట్ ఇస్తుందని చెప్పొచ్చు.

స్టోరీ.స్క్రీన్ ప్లే గురించి పట్టించుకోకుండా పాత కథనే కొత్త నటులతో చూస్తే ఎలా ఉంటుందో ది వారియర్ అలా ఉంటుంది.

సినిమాకు ఆల్రెడీ డివైడ్ టాక్ రాగా మరి ఈ టాక్ వసూళ్ల మీద ఏమేరకు ప్రభావం చూపిస్తుందో చూడాలి.

ఇడ్లీ, సాంబార్ ట్రై చేసిన రష్యన్ యువతి.. ఆమె రియాక్షన్ ఇదే..?