బెంచ్‌పై ఇరగదీసిన రెడ్ కుర్రాడు

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఇటీవల ఇస్మార్ట్ శంకర్ అనే సినిమాతో అదిరిపోయే హిట్ కొట్టాడు.

ఈ సినిమాతో ఫుల్ జోష్‌లోకి వచ్చిన రామ్ ఇప్పుడు తన నెక్ట్స్ మూవీని రెడీ చేస్తున్నాడు.

‘రెడ్’ అనే టైటిల్‌తో తెరకెక్కతున్న ఈ సినిమాలో రామ్ డ్యుయెల్ రోల్‌లో నటిస్తున్నాడు.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం ఇండస్ట్రీలో తెగ్ హల్‌చల్ చేస్తోంది.

ఈ సినిమాలో రామ్ అదిరిపోయే స్టెప్పులు వేస్తున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీలో వేసిన రైల్వే స్టేషన్ సెట్‌లో ఓ బెంచీపై రామ్ చేసే స్టెప్పులు సినిమాకే హైలైట్ కానున్నాయని చిత్ర యూనిట్ అంటోంది.

ఈ సినిమాతో మరోసారి రామ్ తనలోని డ్యాన్స్‌ర్‌ను బయటపెట్టడం కాయమని అంటున్నారు.ఇక యాక్షన్‌కు కొదువే లేని ఈ సినిమాలో రామ్ యాక్టింగ్ పీక్స్‌లో ఉంటుందని, ఈ సినిమాను ప్రేక్షకులు పూర్తిగా ఎంజాయ్ చేస్తారని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి మరోసారి రామ్ తనదైన డ్యాన్స్ స్టెప్పులతో అలరించేందుకు రెడీ అవుతున్నాడు.ఈ సినిమాలో హీరోయిన్‌గా మాళవికా శర్మ, నివేదా పేతురాజ్‌లు నటిస్తున్నారు.

హెబ్బా పటేల్ ఓ స్పెషల్ సాంగ్‌లో రామ్‌తో చిందులు వేయనునంది.కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను స్రవంతి రవికిషోర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా కోసం రంగం లోకి దిగిన ఇద్దరు స్టార్ హీరోయిన్లు…