స్కంద మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఆ 20 నిమిషాలు పూనకాలు వచ్చేలా ఉందంటూ?

టాలీవుడ్ హీరో రామ్ పోతినేని( Ram Pothineni ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ఇటీవల కాలంలో రామ్ పోతినేని వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

వరుసగా సినిమాలలో నటిస్తున్నప్పటికీ ఆ సినిమాలు ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోతున్నాయి.అంతేకాకుండా ఆ సినిమాలు హీరో రామ్ పోతిని రేంజ్ కు తగ్గట్టుగా లేవన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.

ఇకపోతే రామ్ ప్రస్తుతం సినిమాల విషయానికొస్తే. """/" / రామ్ పోతినేని తాజాగా నటించిన చిత్రం స్కంద( Skanda Movie )బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

అంతేకాకుండా థియేట్రికల్ బిజినెస్ నాన్ థియేట్రికల్ బిజినెస్ ఈ రెండు కూడా స్టార్ హీరో సినిమాకి ఏ రేంజ్ లో జరుగుతాయో, అదే రేంజ్ లో జరిగాయి.

ఆ స్థాయిలో ఈ మూవీకి డిమాండ్ ఉంది.కాగా ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల అయిన, పాటలు, పోస్టర్ ట్రైలర్ లకు ప్రేక్షకుల నుండి భారీగా స్పందన లభించింది.

అంతేకాకుండా అవి సినిమాపై అంచనాలను మరింత పెంచేసాయి.కమర్షియల్ సినిమాలను రొటీన్ గా ఫీల్ అయ్యే ప్రేక్షకులకు మాత్రం నచ్చలేదు కానీ, మాస్ ఆడియన్స్ కి మాత్రం తెగ నచ్చేసింది.

"""/" / ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మొదటి కాపీ ని రీసెంట్ గానే ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రివ్యూ షో గా వేశారు.

కొంతమంది మీడియా మిత్రులు, సినీ పరిశ్రమకి చెందిన ప్రముఖులు ఈ షోని వీక్షించారు.

వాళ్ళ నుండి అందుతున్న టాక్ ఏమిటంటే ఈ సినిమా గత బోయపాటి శ్రీనివాస్( Boyapati Srinu ) సినిమాలకంటే అద్భుతంగా వచ్చిందని, యాక్షన్ సన్నివేశాలు ఇది వరకు ఎవ్వరూ చూడని విధంగా ఉన్నాయని, మరి ముఖ్యంగా చివరి 20 నిముషాలు రక్తపాతం మామూలు రేంజ్ లో లేదంటూ టాక్ వినిపిస్తోంది.

అంతేకాకుండా చివరి 20 నిమిషాలు ఈ సినిమాకు హైలైట్ గా నిలవనుంది అని తెలుస్తోంది.

ఆ చివరి 20 నిమిషాలు అభిమానులకు పూనకాలు తెప్పించడం ఖాయం అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీలీల నటించిన విషయం తెలిసిందే.వీరిద్దరి డాన్స్ కి థియేటర్స్ దద్దరిల్లిపోవడం ఖాయం అని తెలుస్తోంది.

మరి భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి మరి.

ఒహియో సెనేట్ సీటుపై వివేక్ రామస్వామి కన్ను? .. ట్రంప్‌తో మంతనాలు అందుకేనా?