స్టార్ డైరెక్టర్లకు షాక్ ఇస్తున్న రామ్ పోతినేని…
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎనర్జిటిక్ స్టార్ గా తనకంటూ పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్న హీరో రామ్ పోతినేని( Ram Pothineni ).
ఇక ఈ సంవత్సరం ఆయన హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన 'డబుల్ ఇస్మార్ట్' సినిమా( 'Double Smart' Movie ) భారీ డిజాస్టర్ ని మూట గట్టుకుంది.
ఇక ఈ సినిమాతో పూర్తిగా డీలా పడిపోయిన రామ్ తనదైన రీతిలో సత్తా చాటాలనే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక అందులో భాగంగానే మహేష్ దర్శకత్వం లో సినిమా చేయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
"""/" /
ఇక ఇప్పటికే మహేష్ 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ( Miss Shetty Mr Polishetty )అనే సినిమాని చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు.
ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తోనే ఆయన రామ్ తో సినిమా చేసే అవకాశాన్నైతే అందిపుచ్చుకున్నాడు.
ఇక ఏది ఏమైనా కూడా రామ్ లాంటి హీరో తనకు డేట్స్ ఇవ్వడం పట్ల చాలామంది సినీ మేధావులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరి ఈ సినిమాతో రామ్ కి మంచి సక్సెస్ దక్కుతుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
బోయపాటి డైరెక్షన్ లో చేసిన స్కంద( Skanda ), పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన డబుల్ ఇస్మార్ట్ రెండు సినిమాలు కూడా పెద్ద సినిమాలుగా వచ్చి భారీ డిజస్టర్లను మూటగట్టుకున్నాయి.
"""/" /
దాంతో చిన్న దర్శకులతో చేసిన పర్లేదు కానీ మంచి కంటెంట్ తో సినిమా చేయాలనే ఉద్దేశ్యం తోనే రామ్ ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా విషయంలో రామ్ చాలా తెలివిగా వ్యవహరిస్తూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.
మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాలతో సూపర్ సక్సెస్ ని సాధిస్తే మాత్రం ఇక ఫ్యూచర్ లో రామ్ కెరియర్ డోకా లేకుండా ముందుకు సాగుతుందనే చెప్పాలి.
ఓరి దేవుడా.. 8 కేజీల బిర్యానీ ఎలా తినేశావేంటి సామీ! వీడియో వైరల్