స్టైలిష్ లుక్ లో ఉస్తాద్ శంకర్.. పిక్ అదిరిందిగా!
TeluguStop.com
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మాస్ ఆడియెన్స్ ను మెప్పించాడు రామ్ పోతినేని.అంతకు ముందు వరకు రామ్ చాకోలెట్ బాయ్ లా యువతకు దగ్గరయ్యి ప్రేమ కథలను మాత్రమే ఎంచుకుని వాటిలో నటిస్తూ వచ్చాడు.
అయితే పూరీ జగన్నాథ్ ఈ లవర్ బాయ్ ను కాస్త మాస్ లుక్ లోకి మార్చి ప్రేక్షకులకు ఇష్మార్ట్ శంకర్ అంటూ కొత్తగా పరిచయం చేసాడు.
ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో రామ్ ఫాలోయింగ్ కూడా పెరగడమే కాకుండా ఈయన మాస్ హీరోల లిష్టులోకి చేరిపోయాడు.
ఇక ఈ సినిమా తర్వాత రామ్ లింగుస్వామి దర్శకత్వంలో 'ది వారియర్' సినిమా చేసాడు.
కానీ ఈ సినిమా విజయం సాధించలేదు.దీంతో ఈసారి రామ్ యాక్షన్ డైరెక్టర్ ను లైన్లో పెట్టాడు.
బోయపాటి దర్శకత్వంలో రామ్ నెక్స్ట్ సినిమాకు కమిట్ అయ్యాడు.దీంతో ఇప్పుడు బోయపాటి సినిమాతో అయినా మంచి హిట్ అందుకోవాలని ఆశ పడుతున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా గ్రాండ్ గా లాంచ్ అయ్యి షూట్ స్టార్ట్ చేసారు.
పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు కూడా ఇప్పటికే టాక్ బయటకు వచ్చింది.
"""/"/
ఇది ఇలా ఉండగా రామ్ తాజా మేకోవర్ పిక్ బయటకు వచ్చింది.
ప్రముఖ వ్యాపార సంస్థ ఓపెనింగ్ కోసం వచ్చిన రామ్ లుక్ ఇప్పుడు వైరల్ అయ్యింది.
ఈ సందర్భంగా ఈయనను చూసేందుకు ఫ్యాన్స్ భారీ ఎత్తున విచ్చేసారు.తాజాగా వచ్చిన లుక్ లో రామ్ స్టైలిష్ కాస్ట్యూమ్స్, అదిరిపోయే గాగుల్స్, ఫుల్ గడ్డంతో రగ్డ్ లుక్ లో దర్శనం ఇచ్చాడు.
ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది.ఇక రామ్ కెరీర్ లో 20వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై నిర్మిస్తుండగా.
థమన్ సంగీతం అందిస్తున్నారు.మరి ఈ సినిమాతో బోయపాటి రామ్ కెరీర్ కు ఎలాంటి బూస్ట్ ఇస్తాడో చూడాలి.
Lorem Ipsum Dolor Sit Amet