ఇస్మార్ట్ శంకర్ తో జాతిరత్నాలు డైరెక్టర్.. నిజమేనా?
TeluguStop.com
జాతిరత్నాలు సినిమాతో తెలుగులో సాలిడ్ హిట్ అందుకున్నాడు డైరెక్టర్ అనుదీప్ కె వి.
ఈ సినిమా కంటే ముందు పిట్టగోడ అనే ప్లాప్ సినిమా తో ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు.
ఈ సినిమా ప్లాప్ తర్వాత జాతిరత్నాలు సినిమా చేసాడు.ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
అనుదీప్ ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకుని ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు.ఇక ఈ సినిమా తర్వాత అనుదీప్ తమిళ్ హీరో శివకార్తికేయన్ తో బైలింగ్వన్ సినిమా ప్రిన్స్ చేసాడు.
మరి ఈయన సినిమాల్లో కూడా కామెడీతో బాగా అలరిస్తాడు.కానీ వరుసగా ఇలాంటి సినిమాలు చేసిన ప్రేక్షకులు బోర్ గా ఫీల్ అవుతారు కాబట్టి మూడవ సినిమాను కొద్దిగా డిఫెరెంట్ గా తీసాడు.
కానీ ఇది జాతిరత్నాలు అంత ఆకట్టుకోలేదు.తమిళ్ లో వసూళ్ల పరంగా పర్వాలేదు అనిపించినా తెలుగులో పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.
అయినా అతడితో సినిమాలు తీయడానికి నిర్మాతలు ముందుకు వస్తున్నారు.ఇదిలా ఉండగా బయట కూడా అనుదీప్ యాటిట్యూడ్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.
ఈయన స్టేజ్ మీద స్పీచ్ ఇస్తే అంతా అలా వింటూ ఉండాల్సిందే. """/"/
ఈయన మ్యాజిక్ అందరికి నచ్చి మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు.
ఈయన ప్రెసెంట్ మూడు బడా సంస్థల దగ్గర అడ్వాన్సులు తీసుకున్నట్టు టాక్.ఇది పక్కన పెడితే ఈయన ఇస్మార్ట్ శంకర్ రామ్ పోతినేని కోసం కథ రాసినట్టు టాక్ వస్తుంది.
రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈయన కోసమే దీనిని రాసుకోగా రామ్ కూడా ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తుంది.
అయితే రామ్ చేతిలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి అయితే కానీ ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళదు.
ఈ గ్యాప్ లో నిర్మాతలు రెడీగా ఉన్నారు కాబట్టి అనుదీప్ మరో సినిమా చేసే అవకాశం ఉంది.
ఇక మీదట అనంత్ శ్రీరామ్ కి పెద్ద సినిమాలకి పాటలు రాసే అవకాశం వస్తుందా.?