డబుల్ ఇస్మార్ట్ మూవీ సెన్సార్ రివ్యూ.. హీరో రామ్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ చేరనుందా?
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో విభిన్నమైన కథాంశాలతో కెరీర్ ను కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్న హీరోలలో రామ్( Hero Ram ) ఒకరు.
డబుల్ ఇస్మార్ట్( Double Ismart ) తాజాగా సెన్సార్ పూర్తి చేసుకోగా ఈ సినిమాకు సెన్సార్ సభ్యుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.
ప్రధానంగా క్లైమాక్స్ ట్విస్ట్ మైండ్ బ్లోయింగ్ గా ఉంటుందని ఆ ట్విస్ట్ ప్రేక్షకుల ఊహకు అందని విధంగా ఉండనుందని సమాచారం అందుతోంది.
పూరీ జగన్నాథ్( Puri Jagannadh ) హీరో రామ్ కు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందించే అవకాశాలు అయితే ఉన్నాయని సెన్సార్ టాక్ ద్వారా అర్థమవుతోంది.
డబుల్ ఇస్మార్ట్ సినిమాలో సంజయ్ దత్( Sanjay Dutt ) పవర్ ఫుల్ రోల్ లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే.
కావ్య థాపర్( Kavya Thapar ) ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా పూరీ జగన్నాథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించారు.
"""/" /
సెన్సార్ సభ్యుల టాక్ ప్రకారం డబుల్ ఇస్మార్ట్ రామ్, పూరీ జగన్నాథ్ లకు కంబ్యాక్ మూవీ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.
అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కిందని సమాచారం అందుతోంది.
రామ్ పోతినేని, సంజయ్ దత్ కాంబినేషన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని సమాచారం అందుతోంది.
మణిశర్మ మ్యూజిక్, బీజీఎం ఈ సినిమాకు ప్లస్ కానున్నాయని తెలుస్తోంది. """/" /
స్టార్ కమెడియన్ అలీ కామెడీ టైమింగ్ ఈ సినిమాకు హైలెట్ గా నిలవనుందని భోగట్టా.
డబుల్ ఇస్మార్ట్ సినిమాకు బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగింది.ఈ సినిమాకు ఊహించని స్థాయిలో టేబుల్ ప్రాఫిట్స్ వచ్చాయని భోగట్టా.
డబుల్ ఇస్మార్ట్ బాక్సాఫీస్ ను షేక్ చేయడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
డబుల్ ఇస్మార్ట్ సోలోగా రిలీజ్ అయ్యి ఉంటే ఈ సినిమాకు బెనిఫిట్ కలిగి ఉండేది.
పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. అసలేమైందంటే?