‘స్కంద’ ఓపెనింగ్స్ కుమ్మేసాడుగా.. రామ్ కెరీర్ లోనే బెస్ట్ వసూళ్లు!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రామ్ పోతినేని ( Ram Pothineni )హీరోగా యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ''స్కంద'( Skanda Movie )'.

బిగ్ మాస్ మసాలాగా తెరకెక్కిన స్కంద మూవీ గురువారం రోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.

రామ్ కెరీర్ లోనే అత్యధిక థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ అయ్యింది.

మరి మొదటి రోజు స్కంద వరల్డ్ వైడ్ గా ఎంత కలెక్షన్స్ ను రాబట్టిందో చూద్దాం.

"""/" / స్కంద సినిమాను బోయపాటి ( Boyapati Srinu )తెరకెక్కించడంలో ముందు నుండి అంచనాలు భారీగా ఉన్నాయి.

ఇక ఇందులో రామ్ సరసన మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీల ( Sreeleela )హీరోయిన్ గా నటించడంతో ఆడియెన్స్ అంత ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూసారు.

మరి నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా ఓపెనింగ్స్ కుమ్మేసినట్టు తెలుస్తుంది.ఈ సినిమా మొదటి రోజు ముఖ్యంగా మాస్ సెంటర్స్ లో మంచి కలెక్షన్స్ వచ్చాయట.

ఇష్మార్ట్ శంకర్ తోనే రామ్ మంచి మాస్ హిట్ అందుకుని క్రేజ్ పెంచుకోగఇప్పుడు స్కంద సినిమా( Skanda Movie ) మరిన్ని కలెక్షన్స్ రాబట్టింది.

హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ ఓపెనింగ్స్ తెచుకున్నట్టు తెలుస్తుంది.

"""/" / ఇక ఏరియాల వారీగా ఈ సినిమా కలెక్షన్స్ ను పరిశీలిస్తే.

నైజాంలో 3.23 కోట్లు, సీడెడ్ లో 1.

22 కోట్లు, వైజాగ్ లో 1.19 కోట్లు, ఈస్ట్ లో 59 లక్షలు, వెస్ట్ లో 41 లక్షలు, కృష్ణాలో 45 లక్షలు, గుంటూరులో 1.

04 కోట్లు, నెల్లూరులో 49 లక్షల షేర్ వచ్చినట్టు టాక్.మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ 8.

62 కోట్ల రేంజ్ లో షేర్ రాబట్టినట్టు తెలుస్తుంది.ఇది రామ్ కెరీర్ లోనే బెస్ట్ నంబర్స్ అనే చెప్పాలి.

థమన్ ( Thaman S )సంగీతం అందించిన ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్ తో నిర్మించారు.

మొటిమలు మచ్చలను పోగొట్టి ముఖాన్ని తెల్లగా మెరిపించే ఎఫెక్టివ్ రెమెడీ ఇది..!