రామ్ 19.. డ్యుయల్ హంగామా..!
TeluguStop.com
ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రస్తుతం లింగుసామి డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో రామ్ పోలీస్ పాత్రలో నటిస్తాడని అంటున్నారు.
మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.
ఈమధ్యనే సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా నుండి లేటెస్ట్ గా ఒక న్యూస్ బయటకు వచ్చింది.
సినిమాలో రామ్ డ్యుయల్ రోల్ చేస్తున్నాడని టాక్.లింగుసామి సినిమాలో రామ్ రెండు పాత్రల్లో నటిస్తున్నాడని తెలుస్తుంది.
ఇస్మార్ట్ శంకర్, రెడ్ సినిమాల హిట్ తో సూపర్ ఫాం లో ఉన్న రామ్ లింగుసామి సిన్మాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు.
ఇస్మార్ట్ రామ్ ఇప్పుడు మంచి ఫాం లో ఉన్నాడు.లింగుసామి సినిమా కూడా తన ఫ్యాన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా చూసుకుంటున్నాడట.
రామ్ డ్యుయల్ రోల్ లో హంగామా చేస్తాడని తెలుస్తుంది.ఈ సినిమాకు హీరోయిన్ కృతి శెట్టి కూడా చాలా ప్లస్ అవుతుందని చెప్పొచ్చు.
దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినీమాతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు.
ఈ సినిమాతో పాటుగా రామ్ తన నెక్స్ట్ సినిమా మరో క్రేజీ కాంబినేషన్ ఫిక్స్ చేయాలని చూస్తున్నాడు.
అల్లు బ్రాండ్ చెక్కు చెదురుతోందిగా.. బన్నీ ఆ ఇబ్బందులను ఎదుర్కోనున్నారా?