రామ్ చరణ్ నన్ను కొట్టి సారీ చెప్పారు.. రామ్ హీరో సూర్య కామెంట్స్ వైరల్!

జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా రామ్( Ram  Movie ) అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే .

ఈ సినిమా ద్వారా సూర్య (Suriya ) అయ్యాల సోమయాజులు హీరోగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు.

ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నటువంటి తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.

ఈ ప్రమోషన్లలో భాగంగా ఈయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొని హీరో రామ్ చరణ్ ( Ram Charan) నటించినటువంటి గేమ్ చేంజర్ ( Game Changer ) సినిమా గురించి కొన్ని విషయాలను వెల్లడించారు.

తాను ఈ సినిమాలో కూడా నటించారని హీరో నవీన్ చంద్ర బ్యాచ్ లో తను కూడా కనిపిస్తాను అంటూ ఈయన వెల్లడించారు.

"""/"/ తాజాగా ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని సంఘటనలను సూర్య గుర్తు చేసుకున్నారు.

ఈ సినిమాలో ఓ యాక్షన్ సన్నివేశంలో నటించే సమయంలో రామ్ చరణ్ తనని కొడుతూ సారీ చెప్పేవారు అంటూ ఈయన తెలిపారు.

ఒక యాక్షన్ సీక్వెన్స్( Action Scenes ) లో భాగంగా రామ్ చరణ్ కొడితే మేము గాలిలోకి బౌన్స్ అవ్వాలి.

ఆ సీన్ చేయడానికి సుమారు 10 టేక్ లు తీసుకున్నాము. """/"/ ఇలా రామ్ చరణ్ గారు పది సార్లు నన్ను కొట్టి నాకు సారీ చెప్పారు.

కొట్టిన ప్రతిసారి వచ్చి సారీ చెప్పేవారు.తాను అమృత్ సర్ షెడ్యూల్‌లో  ఓ పదిహేను రోజులు వర్క్ చేసినట్టుగా చెప్పుకొచ్చాడు.

ఇక రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ  రామ్ చరణ్ ఎంతో హంబుల్ పర్సన్ అంటూ సూర్య చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.ఇక గేమ్ చేంజర్ సినిమా ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటుంది.

కెనడాలో ముగ్గురు భారతీయ విద్యార్ధుల హత్య .. రంగంలోకి విదేశాంగ శాఖ