రామ్ కృతిశెట్టి 'ది వారియర్' ప్రివ్యూ
TeluguStop.com
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరో గా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా రూపొందిన చిత్రం ది వారియర్.
ఈ సినిమా కు సంబంధించిన షూటింగ్ ప్రారంభం అయినప్పటి నుండి కూడా పెద్ద ఎత్తున హడా వుడి చేస్తున్నారు.
తమిళ మీడియా లో ఈ సినిమా గురించి ప్రముఖంగా ప్రచారం చేశారు.తమిళ్ దర్శకుడు లింగు స్వామి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ను రేపు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అయ్యారు.
ఉప్పెన తర్వాత బంగార్రాజు మరియు శ్యామ్ సింగ రాయ్ సినిమా లతో సక్సెస్ లను దక్కించుకున్న ముద్దు గుమ్మ కృతి శెట్టి త్వరలోనే మరో విజయాన్ని ఈ సినిమా తో అందుకుంటుంది అంటూ మొన్నటి వరకు ప్రచారం చేస్తూ వచ్చారు.
సక్సెస్ సెంటిమెంట్ ఎంత వరకు వర్కట్ అవుతుందో అనే నమ్మకం చాలా మంది లో కనిపించడం లేదు.
అయినా కూడా ఈ సినిమా పై చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
ఉప్పెన బ్యూటీ కి వచ్చిన సక్సెస్ లు ఈ సినిమా తో కంటిన్యూ అవుతాయా లేదా అనేది తెలియాల్సి ఉంది.
రామ్ మరియు కృతి శెట్టిల జోడీకి ఖచ్చితంగా మంచి మార్కులు పడుతాయనే నమ్మకం కూడా ఉంది.
ఇదే సమయంలో సినిమా లోని పాటలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.కనుక రామ్ ది వారియర్ సినిమా కూడా విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్.
ప్రస్తుతం సినిమా కు సంబంధించిన హడా వుడి భారీ గా ఉంది.మరి సినిమా విషయం లో టాక్ ఎలా ఉంటుంది అనేది మరి కొన్ని గంట ల్లో క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
అమెరికాలో హైదరాబాద్ యువకుడు దారుణ హత్య..