తొందర్లోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న రామ్…
TeluguStop.com
ఈ మధ్య యంగ్ హీరోలు అందరు వరుసగా ఒకరి వెనక ఒకరు పెళ్లి చేసుకుంటున్నారు.
ఇప్పటికే యంగ్ హీరోలుగా కొనసాగుతున్న శర్వానంద్ రక్షిత రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టారు.
అలాగే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా హీరోయిన్ లావణ్య త్రిపాఠిని జూన్ 9 న ఎంగేజ్మెంట్ చేసుకొని ఈయన కూడా పెళ్లి జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు.
అయితే తాజాగా టాలీవుడ్ లో మరో యంగ్ హీరో కూడా పెళ్లికి సిద్ధమయ్యారు అంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.
"""/" /
ఇక ఆ హీరో ఎవరో కాదు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని( Ram Pothineni ).
రామ్ ఇండస్ట్రీ కి వచ్చి దాదాపు 20 సంవత్సరాలు కావస్తోంది అయిన కూడా ఇంకా పెళ్లి చేసుకోవటం లేదు అనే టాక్ చాలా రోజుల నుంచి వినిపిస్తుంది.
ఇక మొత్తానికి ఆయనకూడా పెళ్లి కి గ్రీన్ సిగ్నల్( Ram Pothineni Green Signal For Marriage ) ఇచ్చినట్టు తెలుస్తోంది.
అయితే ఇంతకు ముందు కూడా పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ చాలా వార్తలు వచ్చాయి కానీ ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తున్నారు రామ్ పోతినేని.
అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఇప్పటికే చాలామంది యంగ్ హీరోలు ఒకరి తర్వాత ఒకరు పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ చెబుతున్నారు.
అయితే త్వరలోనే రామ్ పోతినేని కూడా తన పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ ని బయట పెట్టబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం రామ్ పోతినేని బోయపాటి శ్రీను ( Ram Pothineni Boyapati Srinu New Movie )దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు.
ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలా హీరోయిన్ గా నటిస్తోంది.అయితే ఈ సినిమా షూటింగ్ అయిపోవడంతోనే రామ్ పోతినేని తన పెళ్లి పనుల్లో బిజీ అవుతారని తెలుస్తోంది.
"""/" /
ఇక రామ్ పోతినేని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి హైదరాబాద్ కి చెందిన అమ్మాయి అని వీరి ఫ్యామిలీ హైదరాబాదులోనే ఉంటుందని సమాచారం.
అలాగే రామ్ పోతినేని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఇండియాలోనే టాప్ బిజినెస్ మాన్ కూతురు( Daughter Of Top Businessman In India ) అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
అలాగే రామ్ పోతునేని ఈ సినిమా తర్వాత పెళ్లి చేసుకోబోతున్నాడు కాబట్టే తన నెక్స్ట్ సినిమా గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు అని కూడా కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
అయితే ఇదే నిజం అయితే రామ్ పోతినేని అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు అని ఈ విషయం నిజం అవ్వాలని అందరూ కోరుకుంటున్నారు.
డొనాల్డ్ ట్రంప్ టీమ్‌లో మరో భారత సంతతి నేత .. ఎవరీ శ్రీరామ్ కృష్ణన్?