ఆదిపురుష్‌తో పోలిస్తే హనుమాన్ సూపర్ చీప్ ఫిల్మ్.. వర్మ షాకింగ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

తరచూ ఎవరో ఒకరిపై సంచలన ట్వీట్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ లేనిపోని వివాదాలను కొని తెచ్చుకుంటూ ఉంటారు ఆర్జీవి.

కేవలం సినిమాలకు సంబంధించిన వ్యవహారాలలో మాత్రమే కాకుండా రాజకీయాలకు సంబంధించిన వ్యవహారాలలో కూడా తలదూరుస్తూ ఎవరో ఒకరిపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు.

ఇలా నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంటారు రాంగోపాల్ వర్మ.

</br """/" / మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో సంచలన ట్వీట్లు చేస్తూ ఉంటారు.

ఇది ఇలా ఉంటే తాజాగా వర్మ హనుమాన్ మూవీ గురించి వర్మ ఆసక్తికర కామెంట్స్ చేసారు.

ప్రస్తుతం ఆ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం.

విజువల్ వండర్ గా ఆడియన్స్ కి గూస్‌బంప్స్ తెప్పించాయి అన్న విషయం మనందరికి తెలిసిందే.

ఇక ఈ విజువల్స్ ని చాలా తక్కువ ఖర్చులో ప్రశాంత్ వర్మ( Prasanth Varma ) చూపించారు.

కేవలం 40 కోట్ల బడ్జెట్ తో ఈ విజువల్ వండర్ ని తెరకెక్కించి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు.

ఆ సినిమాలోని గ్రాఫిక్స్ చూసి రామ్ గోపాల్ వర్మ కూడా ఆశ్చర్యపోయారట.</br """/" / ఆదిపురుష్ సినిమా( Adipurush )లోని గ్రాఫిక్స్ ని బయట దేశాల్లో ఎన్నో కోట్లు ఖర్చుపెట్టి రూపొందించారు.

ఇక హనుమాన్ కి సంబంధించిన గ్రాఫిక్స్ ని హైదరాబాద్ లోని ఒక చిన్న ఆఫీస్ లో చేసి అద్భుతమైన అవుట్ ఫుట్ తో వావ్ అనిపించారు.

అవి చూసి నేను ప్రశాంత్ వర్మని ప్రశ్నించాను.ఇది ఎలా చేసావు అని? దానికి అతను ఒక మాట చెప్పాడు.

వేరే దేశాల్లో చేసినా, ఇక్కడ చేసినా, ఆ గ్రాఫిక్స్ డిజైన్ ఒక రూమ్‌లోనే‌గా చేయాల్సింది.

కానీ మనకి కావాల్సింది టాలెంట్ ఉన్న వ్యక్తి అంతే.అని బదులిచ్చాడు అంటూ ఆర్జీవీ చెప్పుకొచ్చారు.

ప్రశాంత్ వర్మ చెప్పిన మాటలు వంద శాతం కరెక్ట్ అని చెప్పుకొచ్చారు.బడ్జెట్ పరంగా ఆదిపురుష్‌తో పోలిస్తే హనుమాన్ సూపర్ చీప్ ఫిలిం.

కానీ రిజల్ట్ పరం హనుమాన్ ఏంటో అందరూ చూసారు అంటూ ఆర్జీవీ చెప్పుకొచ్చారు.

సందీప్ కిషన్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న నాగార్జున హీరోయిన్…