టీడీపీ కి దబిడి దిబిడే ! ఎన్టీఆర్ ప్రస్తావన తో వర్మ సెటైర్లు
TeluguStop.com
టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) అరెస్టు తర్వాత వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma ) సోషల్ మీడియా ద్వారా మరింతగా తన ప్రతాపాన్ని చూపిస్తున్నారు.
టిడిపి పైన, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపైన సెటైర్లు వేస్తూ అనేక కామెంట్లు చేస్తున్నారు.
మొదటినుంచి టిడిపి విషయంలో వర్మ ఇదే వైఖరితో ఉంటూ వస్తున్నారు. పరోక్షంగా వైసిపికి మద్దతు పలుకుతూ సందర్భం దొరికినప్పుడల్లా టిడిపి, ఆ పార్టీ అధినేత చంద్రబాబు, లోకేష్ ల పైన విమర్శలు చేస్తూ ఉంటారు.
"""/" /
తాజాగా మరోసారి ట్వీట్ చేసిన వర్మ ఈసారి జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు.
చంద్రబాబు అరెస్టు పై జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడం, కనీసం సోషల్ మీడియా ద్వారా అయినా తన సందేశాన్ని వినిపించకపోవడం వంటి వాటిపై ఇప్పటికే టిడిపి నాయకులు( TDP ) జూనియర్ ఎన్టీఆర్ ను టార్గెట్ చేసుకుని అనేక విమర్శలు చేస్తున్నారు.
దీనిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ టిడిపి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ వివాదాలు ఇలా కొనసాగుతుండగా వర్మ చేసిన తాజా ట్వీట్ మరింత దుమారాన్ని రేపింది.
"""/" /
తాజా ట్వీట్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకొచ్చారు.
' చంద్రబాబు అరెస్ట్ ను ఖండించడంలో కానీ, స్పందించడంలో కానీ యంగ్ టైగర్ అసలు కేర్ చేయడం లేదంటూ.
టిడిపి ఫ్యూచర్ ఇక దబిడి దిబిడే అంటూ తన ట్వీట్ లో ప్రస్తావించారు.
ఇటీవల కాలంలో టిడిపి తో పాటు, జనసేన ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పైన(
Pawan Kalyan ) రాంగోపాల్ వర్మ ట్వీట్లు చేస్తున్నారు.
ఇప్పటికే టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టు, పవన్ ను పోలీసులు అడ్డుకోవడం పైన సెటైర్లు వేశారు .
ఇక జూనియర్ ఎన్టీఆర్ ఈ వ్యవహారాలపై స్పందించకపోవడంపై వస్తున్న కామెంట్స్ పై తాజాగా టిడిపి పై సెటైర్లు వేశారు.
అమెరికాలో భారతీయుల బహిష్కరణ .. ట్రావెల్ ఏజెన్సీలపై పంజాబ్ పోలీసుల ఫోకస్