ఆ ఓటీటీని పట్టించుకుంటున్న వారే లేరట

ఇప్పటికే ప్రత్యేకంగా టాలీవుడ్‌ సినిమాల కోసం ఆహా ఓటీటీ ఉంది.ఆహా ప్రారంభించి ఏడాదే అయినా కూడా మంచి గుర్తింపును దక్కించుకుంది.

అల్లు అరవింద్ ఈ ఓటీటీ కోసం మంచి టీమ్ ను రెడీ చేశాడు.

క్రియేటివ్‌ టీమ్ నుండి మొదలుకుని కథల ఎంపిక కోసం మరియు సినిమాల ఎంపిక కోసం ఇలా అన్ని విధాలుగా ఆహా మంచి కంటెంట్‌ ను అందించేందుకు వర్క్‌ చేస్తున్నారు.

ఇప్పటికే ఆహాలో స్ట్రీమింగ్‌ అయిన సినిమాలు మరియు రాబోతున్న సినిమాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

తక్కువ సమయంలో నే భారీ మొత్తంలో డౌన్‌ లోడ్స్ ను దక్కించుకోవడంతో పాటు ఎక్కువ సంఖ్యలో ఖాతాదారులు కూడా అయ్యారు.

ప్రస్తుతం ఆహా ఓటీటీ అమెజాన్‌ వంటి పెద్ద ఓటీటీ తో పోటీగా నిలుస్తోంది.

ఇటీవల ఆహా కు పోటీ అన్నట్లుగా పూర్తి తెలుగు ఓటీటీ ప్లాట్‌ ఫామ్ స్పార్క్ వచ్చింది.

రామ్‌ గోపాల్‌ వర్మ డీ కంపెనీ సినిమా తో స్పార్క్‌ మొదలు అయ్యింది.

రామ్‌ గోపాల్‌ వర్మ స్పార్క్ ను తన ఓటీటీగా ప్రచారం చేశాడు.ప్రభాస్ తో పాటు పలువురు స్టార్స్ కూడా స్పార్క్‌ కు ప్రమోషన్‌ లో సాయం చేశారు.

ఎందరు ఏం చేసినా కూడా మంచి కంటెంట్‌ ఉంటే తప్ప స్పార్క్‌ ను జనాలు పట్టించుకునే అవకాశం లేదు.

డీ కంపెనీ సినిమాతో మొదలు అయిన అపజయాల పరంపర ఇటీవల వచ్చిన క్యాబ్‌ స్టోరీ వరకు సాగింది.

క్యాబ్‌ స్టోరీ వంటి ఏమాత్రం ఆకట్టుకోని సినిమాను ఎలా తీసుకు వచ్చారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.

స్పార్క్‌ ఓటీటీ ఇకపై కూడా అలాంటి కంటెంట్‌ ను తీసుకు వస్తే మాత్రం దాన్ని పట్టించుకునే వారు ఉండరు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

స్పార్క్ ఓటీటీ ఆర్థికంగా బ ఆగానే ఉన్నా మంచి టీమ్‌ ఉంటే తప్ప సక్సెస్ అయ్యే అవకాశం లేదంటున్నారు.

ఏపీలో పది రోజుల్లో కురుక్షేత్ర యుద్ధం..: సీఎం జగన్