29 మంది చనిపోయిన సమయంలో చట్టం గుర్తుకు రాలేదా.. ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు!
TeluguStop.com
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో సంధ్య థియేటర్ ఘటన సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే.
డిసెంబర్ ఐదవ తేదీన జరిగిన ఈ ఘటన ఇప్పట్లో ఒక కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు.
పుష్ప 2 సినిమా( Pushpa 2 Movie ) రిలీజ్ రోజున హైదరాబాదులోని సంధ్య థియేటర్ ( Sandhya Theatre )వద్ద తొక్కిసలాట జరగగా ఆ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే.
ఈ కేసు విషయంపై పోలీసులు అల్లు అర్జున్ అరెస్టు చేసిన విషయం కూడా తెలిసిందే.
ఇక అల్లు అర్జున్ అరెస్టు చేయడంతో ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.
అల్లు అర్జున్ ( Allu Arjun )అరెస్ట్ అయ్యి ఆ తర్వాత ఇంటికి రావడంతో చాలామంది సెలబ్రిటీలు రాజకీయ నాయకులు ఆయన అరెస్టుపై స్పందించడం నేరుగా ఆయన ఇంటికి వెళ్లి కలవడం లాంటివి చేశారు.
"""/" /
అదేవిధంగా బన్నీ అరెస్టు ఘటన పై టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ ( Directed Ramgopal Varma )సైతం స్పందించిన విషయం తెలిసిందే.
ఈ మేరకు వర్మ స్పందిస్తూ అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి తెలంగాణ ప్రభుత్వం తప్పు చేసిందని ఆయన అన్నారు.
ఈ ఘటనలో A11గా ఉన్న వ్యక్తిని నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ఇప్పటికే నెటిజన్ల నుంచి కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి.
అలాగే సినిమా విడుదల సమయంలో ఇలాంటి తొక్కిసలాట ఘటనలు గతంలో చాలా జరిగాయని వర్మ గుర్తుచేశారు.
ఆ సమయంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారని ఆయన అన్నారు.రేవతి కుటుంబానికి ముమ్మాటికి నష్టం జరిగిందని చెప్పిన వర్మ ఆ పేరుతో మరోక వ్యక్తిని ఇబ్బంది పెట్టడం ఎంత వరకు కరెక్ట్ అనేది ఆలోచించాలని ఆయన అన్నారు.
"""/" /
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బన్నీ అరెస్ట్ గురించి చేసిన కామెంట్లు కూడా అభ్యంతరంగా ఉన్నాయని వర్మ అన్నారు.
సంజయ్ దత్, సల్మాన్ ఖాన్ అరెస్ట్ అయ్యారని అంటున్నారు.వారిపై నమోదైన కేసులకు, బన్నీ మీద నమోదు అయిన కేసుకు చాలా తేడా ఉందని ఆయన గుర్తు చేశారు.
అలాగే పుష్కరాలు, బ్రహ్మోత్స వాల్లాంటి కార్యక్రమాల్లో తోపులాట జరిగి భక్తులు చనిపోతే దేవుళ్లను అరెస్ట్ చేస్తారా? ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలో ఎవరైనా చనిపోతే నేతలను అరెస్ట్ చేస్తారా? అని వర్మ ప్రశ్నించారు.
ఈ సందర్భంగా వర్మ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో బాగా అడిగారు ఇప్పుడు ప్రభుత్వం ఆర్జీవి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి అంటూ కామెంట్లు చేస్తున్నారు అభిమానులు.
క్రిమినల్స్‌ని ఇలా కూడా తీసుకెళ్తారా.. ఈ పోలీస్ వీడియో చూస్తే నవ్వే నవ్వు…