చిరంజీవికి ఎవరూ ఊరికే డబ్బులివ్వడం లేదు.. వర్మ సంచలన వ్యాఖ్యలు?

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమితాబ్, పూజా హెగ్డే వాలుబుల్ పర్సన్స్ అని అన్నారు.

అవి తెలిసే దర్శకనిర్మాతలు సినిమాలోకి తీసుకున్నారని వర్మ తెలిపారు.అమితాబ్ ఎవరైనా తనతో పాటు ఉండాలని కోరితే అమితాబ్ కంఫర్ట్ కోసం నిర్మాత పే చేయాల్సి ఉంటుందని వర్మ పేర్కొన్నారు.

డీజే టిల్లు సినిమాలో ప్రముఖ యాక్టర్లు ఎవరూ లేరని వర్మ అన్నారు.అందరు నిర్మాతలు ఒకలా ఆలోచించరని వర్మ చెప్పుకొచ్చారు.

కొన్నిసార్లు లెక్కలు వర్కౌట్ అవుతాయని కొన్నిసార్లు వర్కౌట్ కావని వర్మ అన్నారు.సినిమా అనేది ఆడియన్స్ లేకపోతే ఉండదని వర్మ చెప్పుకొచ్చారు.

ఒక్కొక్కరు ఒక్కో కారణంతో సినిమాలను నిర్మిస్తారని వర్మ వెల్లడించారు.ఏ ఇద్దరు నిర్మాతలు ఒకలా ఆలోచించరని వర్మ అన్నారు.

ప్రొడక్షన్ కాస్ట్ కు, బయ్యర్ కు సంబంధం ఉండదని వర్మ తెలిపారు. """/"/ మార్కెట్ ను దృష్టిలో ఉంచుకుని బయ్యర్ హక్కులను కొనుగోలు చేస్తారని వర్మ చెప్పుకొచ్చారు.

చిరంజీవి గారు మెగా స్టార్ అయిన తర్వాత కొత్తగా వచ్చిన నిర్మాతలు చిరంజీవి రాగానే లేచి నిలబడేవారని వెల్లడించారు.

అయితే ఒక నిర్మాత చిరంజీవితో అప్పటికే సినిమాలను నిర్మించి ఉండటంతో ఆయన లేచి నిలబడాలా వద్దా అని ఆలోచించారని వర్మ కామెంట్లు చేశారు.

ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తే మాత్రమే హీరోల డేట్లు వస్తాయని వర్మ చెప్పుకొచ్చారు.చిరంజీవికి ఎవరూ ఊరికే డబ్బులు ఇవ్వడం లేదని చిరంజీవి స్టార్ కాబట్టి ఆయన సినిమాల్లో నటించినందుకు డబ్బులు ఇస్తున్నారని వర్మ పరోక్షంగా పేర్కొన్నారు.

వర్మ తర్వాత ప్రాజెక్ట్ లపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.తర్వాత సినిమాలతో వర్మ ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది.

వర్మ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సలార్ 2 లో కీలక పాత్ర లో నటించనున్న స్టార్ హీరో…