'మా'ను దారుణంగా అవమానించిన వర్మ.. ఎన్నికలపై ఇలాంటి భావమా?

ఇటీవలే మా ఎన్నికలు ఎంత రసవత్తరంగా జరిగాయో మనందరికీ తెలిసిందే.ఈ నేపథ్యంలోనే ఈ ఇరువురి ప్యానల్ సభ్యుల మధ్య మాటల యుద్ధాలు కూడా జరిగాయి.

చివరికి మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికయ్యారు.తాజాగా విష్ణు ప్రమాణస్వీకారం కూడా చేశాడు.

ఇక ప్రకాష్ రాజు ప్యానల్ నుంచి గెలిచిన వారందరూ కూడా ఒక్కసారిగా రాజీనామా చేశారు.

దీనిపై మంచు విష్ణు స్పందించి, అలా రాజీనామా చేయడం బాధాకరమని ఎవరు ఏం చేసినా కూడా మా ముందు కొనసాగుతూనే ఉంటుందని తెలిపాడు.

ఈ విషయంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎంట్రీ ఇచ్చాడు.ఇటీవలే ముగిసిన మా ఎన్నికలు, అలాగే మా సభ్యుల మీద కౌంటర్లు వేశాడు.

తనకు కూచిపూడి నాట్యం కంటే కాబరేట్ డాన్స్ అంటేనే చాలా ఇష్టం అంటూ మా ను దారుణంగా అవమానించాడు.

'మా ' జనాలు తాము నిజమైన సర్కసు వాళ్ళమని ప్రేక్షకులు నిరూపించారని మా ఎన్నికలు జరిగిన తీరుపై కౌంటర్ లు వేసినట్టు తెలుస్తోంది.

"""/"/ నాకు ఎప్పటికైనా సరే కూచిపూడి నాట్యం కంటే కాబరేట్ డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం అని రాంగోపాల్ వర్మ తెలిపాడు.

ప్రేక్షకుల మనసులో సినిమా జనాలు అనే వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అని నమ్మేవారు.

కానీ మా ఎన్నికలలో వారందరూ బిలో ఆర్డినరీ అని నిరూపించుకున్నారు అంటూ వర్మ అందరిని ఏకిపారేశారు.

కానీ తాను మాత్రం ఏ సైడ్ అనేది చెప్పలేదు.ఇక రామ్ గోపాల్ వర్మ ఆ మధ్య ఒకసారి ప్రకాష్ రాజు మీద వచ్చిన నాన్ లోకల్, లోకల్ ఈ విషయంపై స్పందించి, ప్రకాష్ రాజ్ కు మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే.

ఆ యాంకర్లు బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో పాపులర్.. వింధ్య షాకింగ్ కామెంట్స్ వైరల్!