పవన్, లోకేశ్ డబ్బులిచ్చినా ఆ పని చేయను.. రామ్ గోపాల్ వర్మ కామెంట్స్ వైరల్?
TeluguStop.com
టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
తరచూ ఏదో ఒక విషయంతో వార్తలు నిలుస్తూనే ఉంటారు రామ్ గోపాల్ వర్మ.
సినిమాల విషయంతో పాటు సమాజంలో జరిగే పనులు అంశాలపై రాజకీయ అంశాలపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు.
ఇది ఇలా ఉంటే రామ్ గోపాల్ వర్మ ఏపీ సీఎం జగన్ ( CM Jagan )జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా వ్యూహం, శపథం అనే సినిమాలను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
2024 ఏపీ ఎన్నికల లక్ష్యంగా వర్మ ఈ సినిమాలను తెరకెక్కిస్తున్నాడు.మొదటి భాగం వ్యూహం ఈ అక్టోబర్ లో రిలీజ్ కి సిద్దమవుతుంది.
"""/" /
ఇప్పటికే ఈ మూవీ 70 శాతం షూటింగ్ పూర్తి అయ్యినట్లు వర్మ తెలిపారు.
ఇక శపథం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.
కాగా ఈ రెండు చిత్రాలను వర్మ సీఎం జగన్ ను హీరోగా చూపిస్తూ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలకు వైసీపీ నుంచి ఫండింగ్ వస్తుందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.అయితే పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) అండ్ లోకేశ్( Nara Lokesh ) కూడా డబ్బులు పెట్టి వాళ్ళకి అనుకూలంగా సినిమా తీయమంటే చేస్తారా? అని వర్మని ప్రశ్నించగా, తాను తీయను అంటూ బదులిచ్చాడు.
లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీలో నేను సీనియర్ ఎన్టీఆర్ విషయంలో నమ్మిన నిజాన్ని చూపిస్తూనే తెరకెక్కించాను.
"""/" /
ఇప్పుడు జగన్ లో కూడా నేను చూసిన రియాలిటీని, అతని విషయంలో నేను నమ్మిన నిజాన్ని ఆధారాలతో చూపిస్తూనే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను అంటూ వెల్లడించాడు.
పవన్ కళ్యాణ్ డబ్బులు ఇచ్చి సినిమా చేయమని చెప్పిన చెయ్యను అని తెలిపారు రామ్ గోపాల్ వర్మ.
అది విపక్షాలను టార్గెట్ చేసేలా ఉంటుందా? జగన్ కి మళ్ళీ అధికారం తెచ్చిపెడుతుందా? లేదా? అనేది నాకు అనవసరం అని తెలిపాడు.
ఇక ఈ సినిమాలో పవన్ పాత్ర కూడా ఉండబోతుందని, తాను ముందు నుంచి చెబుతున్నట్లు పవన్ కళ్యాణ్ ని ఈ సినిమాలో నిలకడ లేని వ్యక్తిగా చూపించబోతున్నట్లు వెల్లడించాడు.
ప్రస్తుతం వ్యూహం మూవీకి సంబంధించిన కీలక సన్నివేశాల షూటింగ్ విజయవాడలో జరుగుతున్నాయి.
అల్లు అర్జున్ జాతకం పై వేణు స్వామి కామెంట్స్… అసలు సినిమా ముందుంది అంటూ?