ఎంత సెన్సార్ కట్ లేకపోతే మాత్రం కెమెరా ని తొడల మధ్యలో ఉంచి చూపించాలా …

ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియని వారుండరు.

అయితే ఈ మధ్యకాలంలో ఆర్జీవీ ఎక్కువగా తన చిత్రాల వివాదాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు.

గతంలో జీఎస్టి, క్లైమాక్స్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించి వాటిని డిజిటల్ మీడియా ప్లాట్ఫారం లో విడుదల చేసి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు.

అయితే ఈ చిత్రాల వల్ల ఆర్జీవీ కి పెద్దగా ఒరిగిందేమీ లేకపోగా బి గ్రేడ్ చిత్రాల దర్శకుడిగా కొంతమంది నెటిజన్లు ముద్ర వేశారు.

కాగా ఇటీవల రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన మరో చిత్రం ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్ అవుతోంది.

అయితే ఆ చిత్రం ఏంటంటే నగ్నం.ఈ చిత్రం పూర్తిగా నూతన నటీనటులతో తెరకెక్కించినట్లు సమాచారం.

అయితే ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడం కోసం రామ్ గోపాల్ వర్మ వరుస ట్రైలర్లను తన అధికారిక సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా విడుదల చేస్తూ కుర్రకారు గుండెల్లో హిట్ పెంచుతున్నాడు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో ట్రైలర్ని విడుదల చేస్తూ ఈ చిత్రం విడుదల తేదీని కూడా తెలియజేశాడు.

ఇందులో భాగంగా ఈ చిత్రాన్ని  ఆన్ లైన్ ద్వారా ఈ నెల 27వ తారీఖున విడుదల చేస్తున్నామని అంతేగాక ఈ చిత్రాన్ని వీక్షించాలంటే దాదాపుగా రెండు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నాడు.

దీంతో కొందరు నెటిజన్లు ఆర్జీవి చిత్రానికి 200 రూపాయలు కాదు 500 రూపాయలు అయినా చెల్లించవచ్చని తెగ కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ విషయం మీద కొందరు సినీ క్రిటిక్స్ మాత్రం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించినటువంటి ఈ నగ్నం చిత్రం పై పలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాక ఇప్పటివరకు విడుదల చేసినటువంటి ట్రైలర్లను పరిశీలిస్తే ఇందులో ఎక్కువగా అశ్లీలత సన్నివేశాలు మరియు యువతను పెడదోవ పట్టించే దృశ్యాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరి కొందరు మాత్రం ఎంత సెన్సార్ కట్స్ లేకపోతే మాత్రం కెమెరాలను మరీ తొడల మధ్యలో మరియు ప్రైవేటు శరీర భాగాలను హైలెట్ చేసే విధంగా చూపించడం సరికాదని, అలాగే ఇలాంటి చిత్రాల వల్ల ప్రేక్షకులకి సినిమాల పట్ల చెడు అభిప్రాయం ఏర్పడుతుందని అంటున్నారు.

మరి రామ్ గోపాల్ వర్మ ఈ సినీ క్రిటిక్స్ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తాడో చూడాలి.

వైరల్ న్యూస్: 760 ఏళ్ల జైలు శిక్షణ విధించిన కోర్టు.. అసలు మ్యాటరేంటంటే..