GST నీలి చిత్రం కాదు అది ఒక సైన్స్ క్లాస్ : వర్మ తల్లి

రామ్ గోపాల్ వర్మ.( Ram Gopal Varma ) ఈయన పేరు చూసి చెబితే వెగటు పుట్టించే వ్యాఖ్యలే అందరికీ గుర్తుకు వస్తాయి.

అంతా నా ఇష్టం అన్న తీరులో వ్యవహరిస్తు ఎప్పుడు సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉంటారు వర్మ.

అందుకే వర్మ ఏం మాట్లాడినా అది వైరల్ గా మారుతూ ఉంటుంది ఇక అప్పుడప్పుడు ఎవరూ ఊహించని విధంగా రాంగోపాల్ వర్మ తల్లి లేదా చెల్లి తో కలిసి ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటాడు.

మనసులో ఉన్నది ఏది దాచుకోకుండా మాట్లాడటంలో ఆయనకు ఆయనే సాటి.అయితే ఈ తరహాలోనే రాంగోపాల్ వర్మ తల్లి సూర్యమ్మ( Suryamma ) కూడా మాట్లాడుతూ ఉండడం విశేషం.

ఇటీవల కాలంలో ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాంగోపాల్ వర్మ తన తల్లితో కలిసి పాల్గొన్నాడు.

అయితే అందులో యాంకర్ అడిగిన ప్రశ్నలకు దీటుగా జవాబు ఇచ్చిన వర్మ తల్లి, వర్మ తీసిన GST సినిమా గురించి ప్రశ్నిస్తే అందుకు కూడా తనదైన రీతిలో సమాధానం చెప్పింది.

ఇక ఇంతటి అశ్లీలమైన ఒక సినిమా వర్మ తీయడం పట్ల మీ అభిప్రాయం ఏంటి అని యాంకర్ ప్రశ్నించింది.

అందుకు బదులుగా ఆ సినిమా చూస్తున్నంత సేపు డాక్టర్ ఒక శరీర భాగాల గురించి చెప్పినట్టుగా, ఒక సైన్స్ క్లాసుల అనిపించింది అంటూ వర్మ తల్లి( Ram Gopal Varma Mother ) తెలిపారు.

"""/" / ఆ చిత్రాన్ని ఒక నీలి చిత్రంగా చెప్పుకోవడమే మన దేశ దౌర్భాగ్యం అంటూ కూడా ఆమె వ్యాఖ్యానించడం విశేషం.

తాను కూడా ఆ చిత్రాన్ని చూసానని అందులో ఎలాంటి తప్పు లేదని మా దేశంలోనే ఇలాంటివన్నీ మాట్లాడుకుంటారని కానీ అమ్మాయి శరీరం కేవలం శృంగారం కోసం కాకుండా ఆమెలో ఉన్న ఒక సౌందర్యాన్ని, అందాన్ని కూడా ప్రేమించడం తెలుసుకోవాలని తెలిపారు వర్మ తల్లి.

"""/" / తన కొడుకుకి ఏది ఎలా చేయాలో తెలుసు అని, తాను చెప్పాల్సిన స్థితిలో అతడు లేడని, అతడు ఏం చేసినా ఆలోచించే చేస్తాడని, మెచ్యూరిటీ కలిగిన వ్యక్తి అంటూ వర్మ గురించి కొనియాడారు.

వర్మ తల్లి మాటలకు యాంకర్ ఒకింత షాక్ కి గురియ్యిందనే చెప్పుకోవాలి.ఈ సమయంలోనే వర్మ కూడా స్పందిస్తూ తన తల్లి ఆలోచించిన విధానంలోనే తాను కూడా ఆలోచించి ఇలాంటి ఒక చిత్రానికి పూనుకున్నాను అని చెప్పాడు.

పొట్టిగా ఉన్నా ఆ లక్షణం ఉంటే పెళ్లి చేసుకుంటా.. ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్!