పొగడ్తలతో రాజమౌళిని ఆకాశానికి ఎత్తిన రామ్ గోపాల్ వర్మ.. నువ్వు ఓ వరం అంటూ?

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఇటీవలే విడుదల అయి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుని బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా పై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు.

అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.ఈ సినిమాను చూసిన అభిమానులు సినీ ప్రేక్షకులు అదే విధంగా పలువురు ప్రముఖులు చిత్ర బృందం పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాని చూసిన రామ్ గోపాల్ వర్మ దర్శకుడు రాజమౌళి ని పొగడ్తలతో ముంచెత్తారు.

అయితే రాంగోపాల్ వర్మ బయటికి కనిపించకపోయినా రాజమౌళి అంతే అతనికి కూడా అభిమానమే.

అభిమానాన్ని మరొకసారి చాటుకున్నారు రామ్ గోపాల్ వర్మ.ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ సినిమాను చూసిన రామ్ గోపాల్ వర్మ ఒక అద్భుతమైన చిత్రం.

ఈ సినిమాలో నాలోని పిల్లవాడిని బయటపెట్టింది.సినిమా చూసినప్పుడు అన్నీ మర్చిపోయి చిన్నపిల్లవాడిలా సినిమా చూశాను అని చెప్పుకొచ్చారు.

"""/"/ మనస్ఫూర్తిగా ఈ సినిమాను చూస్తూ ఎంజాయ్ చేశాను అని తెలిపారు.మొదటి ట్రైలర్ చూసినప్పుడు సినిమా బాగా ఉంటుంది అనిపించింది కానీ సినిమా చూసిన తర్వాత అద్భుతంగా ఉంది అని చెప్పుకొచ్చారు ఆర్జివి.

అయితే మాములుగా నేను ఏదైనా విష‌యంపై మాట్లాడేట‌ప్పుడు ఫుల్ క్లారిటీతో మాట్లాడుతాను కానీ తొలిసారి ఏం మాట్లాడాలో తెలియ‌డం లేదు.

మాట‌లు క‌రువ‌య్యాయి.క‌థేంటి.

పాత్ర‌లు ఎవ‌రు? అనే విష‌యాల‌ను ప‌క్క‌న పెడితే క‌థ‌ను చెప్పిన తీరు ఎంతో బావుంది.

తార‌క్ పాత్ర బావుంద‌ని, కాదు.చ‌ర‌ణ్ పాత్ర బావుంద‌ని ఇలా చాలా మంది చాలా చెబుతుంటారు.

"""/"/ కానీ అవ‌న్నీ కూడా అవ‌న‌స‌రం.ఎందుకంటె ఎవ‌రి స‌న్నివేశాల్లో వారు అద‌ర‌గొట్టేశారంతే అంటూ రాజమౌళి పై ప్రశంసల వర్షం కురిపించారు రామ్ గోపాల్ వర్మ.

అంతేకాకుండా రాజ‌మౌళి ప్రేక్ష‌కుల‌కు దొరికిన ఓ బంగారం.నీలాంటి వ్య‌క్తి భూమ్మీద‌కు వ‌చ్చి, సినిమాను క‌ల‌గా చేసుకుని మంచి చిత్రాల‌ను డైరెక్ట‌ర్‌గా రూపొందిస్తున్నందుకు ప్రేక్ష‌కులు ఎంతో ఆనందంగా ఉన్నారు.

ముప్పై ఏళ్లలో నేను ఇంత‌లా మ‌రో సినిమాను ఎంజాయ్ చేయ‌లేదు అంటూ రాజమౌళి ని పొగడ్తలతో ముంచెత్తుతూ తనలో ఉన్న అభిమానాన్ని మరొకసారి మాటల రూపంలో వ్యక్త పరిచారు రాంగోపాల్ వర్మ.