వోడ్కా మత్తు ఎక్కిందంటున్న వర్మ.. త్వరలోనే నాగబాబుని కలుస్తానంటూ?

టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, అలాగే మెగా బ్రదర్ నాగబాబు మధ్య బంధం ఏ విధంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే.

రామ్ గోపాల్ వర్మ ఎడ్డెం అంటే నాగబాబు తెడ్డెం అంటాడు.ఒకప్పుడు వీరు ఒకరిపై మరొకరు దారుణమైన కామెంటు చేసుకుని వ్యక్తిగత దూషణకు దిగిన వాళ్లే.

కానీ అవన్నీ మర్చిపోయి ప్రస్తుతం వీరిద్దరూ కలిసిపోయారు.అంతేకాకుండా నాగబాబుని త్వరలో కలిసేందుకు వర్మ కూడా రెడీ అయ్యారు.

ప్రస్తుతం ఏపీ లో జరుగుతున్న టికెట్ రేట్ల ఇష్యూపై వర్మ తనదైన శైలిలో ఏపీ ప్రభుత్వంపై ఈ ప్రశ్నలు వేస్తూ ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ విషయంలో నాగబాబు వర్మ వాదనకు జై కొట్టారు.ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న టికెట్ రేటు విధానాలపై ఆర్జివి చెప్పింది అక్షరాల నిజం.

తన నోటిలో నుండి వచ్చే ప్రశ్నలు వర్మ బయటపెట్టారు అంటూ నాగబాబు ట్వీట్ చేశారు.

ఆ విషయంపై వర్మ కూడా రియాక్ట్ అయ్యారు.ఈ క్రమంలోనే ఒకప్పుడు వారిద్దరి మధ్య జరిగిన విషయాలను ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అంతేకాకుండా సినిమా టికెట్ రేట్ ఇష్యూ ఫై నాకు బాబు స్పందించారు.నేను కూడా రెస్పాండ్ అయ్యాను.

నాగబాబు తో నాకు మంచి రిలేషన్ ఉంది.వరుణ్ తేజ్, పూరి జగన్నాథ్ కాంబోలో సినిమా చేస్తున్నప్పుడు నేను నాగబాబును కలిశాను.

"""/" / ఆయన ఏదో ఆవేశంతో స్టేజిపై ఏదో అన్నాడు.నేను కూడా వోడ్కా మత్తులో ఏదో అంటుంటా.

గతంలో ఇవన్నీ జరిగాయి.కానీ ప్రస్తుతం నేను నాగబాబుని లైక్ చేస్తున్నా.

రెస్పెక్ట్ చేస్తున్నా .లాజిక్ అనేది ఒక్కటే కనెక్టింగ్ ఫ్యాక్టర్.

టైమ్ ని బట్టి ఎమోషన్స్ మారుతాయి.ప్రమోషన్స్ కి లాజిక్స్ ఉండవు అని తెలిపారు.

నాగబాబు ఎమోషన్స్ తో మాట్లాడితే.నేను ఊరు దాటి  ఉన్నా.

నిజం చెప్పాలి అంటే వోడ్కా కూడా ఎమోషన్.అలాగే లాజికల్ గా నాగబాబుతో నాకు జీరో పర్సెంట్ కూడా ప్రాబ్లం లేదు.

నాకు మెగా ఫ్యామిలీ కి ఏదో ఉంది అని సోషల్ మీడియాలో వార్తలు వినిపించినప్పుడు కూడా నాగబాబు నన్ను అభినందించడాన్ని బట్టి ఆయనకు థ్యాంక్స్ చెబుతున్న త్వరలోనే ఆయన కలుస్తాను అంటూ చెప్పుకొచ్చాడు రామ్ గోపాల్ వర్మ.

వాలంటీర్ వ్యవస్థపై మంత్రి నిమ్మల రామానాయుడు సంచలన వ్యాఖ్యలు..!!