వర్మ అంత హడావుడి చేసి ఆ సినిమాని అటకెక్కించాడా?

వివాదాల దర్శకుడు రాం గోపాల్ వర్మ ఇటీవల నైనా గంగూలీ మరియు అప్సర రాణి హీరోయిన్లుగా తెరకెక్కించిన డేంజరస్ అనే సినిమా ను ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు.

సినిమా కు సంబంధించిన విడుదల తేదీ ని కూడా ప్రకటించి హడావుడి చేశాడు.

దేశ వ్యాప్తంగా సినిమా ను భారీ ఎత్తున ప్రమోషన్ చేయడం ద్వారా ఇది ఒక పాన్ ఇండియా మూవీ గా విడుదల చేయబోతున్నట్లు ఆయన తెలియ జేశాడు.

పాన్‌ ఇండియన్ మూవీ గా ఇది ఒక అరుదైన చరిత్రను రాయబోతున్న ఆయన పేర్కొన్నాడు.

దేశ చరిత్ర లో ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా ఈ సినిమా తరహా సినిమా రాలేదని రామ్ గోపాల్ వర్మ అన్నాడు.

చాలా విభిన్నంగా తెరకెక్కించాడని.సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని చాలా ఆసక్తిగా ఎదురు చూశారు.

కానీ తాజాగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది.సినిమా కోర్టు కేసులు ఇతర కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్వయం గా ప్రకటించాడు.

వివాదాల వల్ల సినిమా వాయిదా వేయడం అనేది ఈ మధ్య కాలం లో చాలా అరుదుగా జరుగుతుంది.

వివాదం సద్దుమణిగేలా చేసుకొని సెటిల్మెంట్ చేసి విడుదల చేసుకునేందుకు ముందుకు రావాలి.కానీ రాంగోపాల్ వర్మ మాత్రం ఇప్పటి వరకు డేంజరస్ సినిమావిడుదలకు సంబంధించి ఎలాంటి హడావుడి లేదు.

"""/"/ దాదాపు వారం పది రోజుల పాటు ఇద్దరు హీరోయిన్లతో హడా వుడి చేసిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు అనూహ్యంగా సైలెంట్ అవ్వడంతో ఇన్నాళ్లు కేవలం పబ్లిసిటీ లో భాగంగానే సినిమా హడావుడిగా ప్రమోట్ చేశారు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రాంగోపాల్ వర్మ ఏం చేసినా కూడా ఇలాగే ఉంటుందని.ఆయన క్లారిటీ లేకుండా వ్యవహరిస్తాడు అంటూ సినీ విశ్లేషకులు మరియు ఆయన అభిమానులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు.