ట్రైలర్ టాక్: ‘క్లైమాక్స్’ సీన్ ఏదైతే ఉందో.. అంతే!

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా సెన్సేషన్ క్రియేట్ చేస్తాడు అని ఇండస్ట్రీలో ఓ టాక్.

దీనికి నూటికి నూరుపాళ్లు న్యాయం చేస్తుంటాడు ఈ దర్శకుడు.తనదైన సినిమాలను తెరకెక్కించి, వాటిని వివాదాస్పదంగా మారుస్తూ ఆయన క్రియేట్ చేసే రచ్చ మామూలుగా ఉండదు.

ఇక శృంగార తార మియా మాల్కోవాతో వర్మ చేసి ‘జీఎస్‌టీ(God Sex And Truth)’ వివాదాలను మరో లెవెల్‌కు తీసుకెళ్లిన విషయం తెలిసిందే.

కాగా తాజాగా మరోసారి మియా మాల్కోవాతో ‘క్లైమాక్స్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను ఇటీవల రిలీజ్ చేయగా దానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

ఈ సినిమాలోనూ మియా మాల్కోవా అందాలను పిండేశాడు వర్మ అంటూ ఆయన ఫ్యాన్స్ ఈ టీజర్‌ను తెగ షేర్‌లు చేశారు.

కాగా తాజాగా క్లైమాక్స్ చిత్ర ట్రైలర్‌ను వర్మ రిలీజ్ చేశాడు.ఈ ట్రైలర్ చూస్తే ఇదొక ప్యూర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అని మనకు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో మియా మాల్కోవా తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఓ ఎడారిలో ఎదుర్కొనే ఘటనలను మనకు అత్యంత థ్రిల్లింగ్‌గా వర్మ చూపించనున్నాడు.

అయితే ఈ ట్రైలర్ ఆద్యాంతం థ్రిల్లర్ అంశాలతో పాటు అందాల ఆరబోతతో పిచ్చెక్కించాడు వర్మ.

ముఖ్యంగా క్లైమాక్స్ ట్రైలర్‌లో ఓ సన్నివేశంలో మియా మరోసారి ఒంటిపై నూలుపోగు లేకుండా కనిపించిది.

అటు ట్రైలర్ చివర్లో వచ్చే సీన్ మాత్రం పీక్స్ అని చెప్పాలి.ఈ ఒక్క సీన్‌తో వర్మ తనలోని క్రియేటివిటీని మరోసారి మనకు పరిచయం చేశాడని చెప్పాలి.

అసలు ఇలాంటి ఐడియాలు వర్మకు తప్ప మరెవ్వరికీ రావని ఆయన అభిమానులు అంటున్నారు.

ఏదేమైనా వర్మ క్లైమాక్స్ ట్రైలర్‌తో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అయ్యాడు.

ఈ ట్రైలర్‌పై మీరూ ఓ లుక్కేయండి.

వీక్ డేస్ లో కూడా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు.. పుష్ప ది రూల్ కు అదే ప్లస్ అయిందా?