రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ చిత్రం ఇక ఇప్పట్లో లేనట్లే..ఫ్యాన్స్ కి చేదువార్త!

ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.అందులో ఒక పాత్ర లో రాజకీయ నాయకుడిగా కనిపిస్తుండగా, మరో పాత్రలో సిబిఐ ఏజెంట్ గా నటిస్తున్నాడు.

శంకర్ ఇందులో రామ్ చరణ్ నుండి నట విశ్వరూపాన్ని మొత్తం బయటపెట్టబోతున్నాడని టాక్.

రంగస్థలం తర్వాత ఆయనకీ మరోసారి అలాంటి ఛాలెంజింగ్ రోల్ దొరికిందట.ఇందులో హీరోయిన్ గా కైరా అద్వానీ నటిస్తుండగా, శ్రీకాంత్ , సునీల్ మరియు ఎస్ జె సూర్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

"""/" / రీసెంట్ గానే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసారు.

అలాగే టైటిల్ ని కూడా శంకర్ మార్కు తో సరికొత్త కాన్సెప్ట్ తో వీడియో ని డిజైన్ చేయించి విడుదల చేసారు.

దీనికి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.అయితే షూటింగ్ ప్రారంభమై చాలా రోజులు గడుస్తున్న ఈ చిత్రాన్ని ఎప్పుడు విడుదల చెయ్యబోతున్నారు అనే సందిగ్ధం ఫ్యాన్స్ లో నెలకొంది.

నిన్న మొన్నటి వరకు ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేస్తారేమో అని అనుకున్నారు.

కానీ ఇప్పుడు దిల్ రాజు ఆ ఆలోచనని విరమించుకున్నట్టు సమాచారం.ఎందుకంటే డైరెక్టర్ శంకర్ 'గేమ్ చేంజర్' తో పాటుగా కమల్ హాసన్ తో 'ఇండియన్ 2 ' అనే చిత్రాన్ని కూడా చేస్తున్నాడు.

ఒక నెలలో ఆయన 15 రోజులు 'గేమ్ చేంజర్' చిత్రం షూటింగ్ లో ఉంటే, మరో 15 రోజులు 'ఇండియన్ 2 ' మూవీ షూటింగ్ లో ఉంటున్నాడు.

"""/" / ఇప్పుడు 'ఇండియన్ 2 '( Indian 2 Movie ) కేవలం కొన్ని కీలక సన్నివేశాలు మినహా, షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి అయ్యే స్టేజికి వచేసింది.

ఆ చిత్ర నిర్మాతలు వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రాబోతుంది.అదే కనుక జరిగితే ఇక 'గేమ్ చేంజర్' చిత్రాన్ని వాయిదా వెయ్యాల్సిందే.

రామ్ చరణ్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఆయన రెండవ పాత్రకి సంబంధించిన లుక్స్ రిలీజ్ అయ్యి, ఈ చిత్రం పై అంచనాలను భారీగా పెంచేలా చేసాయి.

సినిమా విడుదల ఇప్పట్లో లేదు అని తెలిసిపోవడం తో వచ్చే టీజర్ ని కూడా ఇప్పట్లో విడుదల చేసే ఆలోచనలో లేరట.

అంటే రామ్ చరణ్ ఫ్యాన్స్ 'గేమ్ చేంజర్' కి సంబంధించిన అప్ డేట్స్ ఇప్పట్లో ఆశించకూడదు.

ఈ చిత్రం పూర్తి అవ్వగానే సెప్టెంబర్ నెల నుండి బుచ్చి బాబు ప్రాజెక్ట్ కి షిఫ్ట్ అవ్వబోతున్నాడు.

కెనడాలో సిక్కు గార్డు పంచ్ పవర్.. ఒక్క గుద్దుతో దుండగుడు ఖతం.. వీడియో వైరల్!