మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాను రాజమౌళి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.కాగా ఈ సినిమాలో నుండి చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇటీవల రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.
ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు.కాగా ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నాడు జక్కన్న.
అయితే ఈ సినిమాతో మరోసారి బాలీవుడ్‌లో అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు చరణ్.
అయితే ఈసారి ఆచితూచి అడుగులు వేస్తాడట.అందుకే ఆర్ఆర్ఆర్‌కు వచ్చే రెస్పాన్స్ తరువాత బాలీవుడ్ నుండి అతడికి వచ్చే ఆఫర్లను పరిశీలించాకే ముందడుగు వేస్తాడట.
మొత్తానికి బాలీవుడ్‌లో టార్గెట్ ఫిక్స్ చేసుకున్న చరణ్‌కు ఆర్ఆర్ఆర్ ఎంతమేర ఉపయోగపడుతుందో చూడాలి అంటున్నారు సినీ ఎక్స్‌పర్ట్స్.
ఇక ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తుండటం గమనార్హం.