డబ్బు కోసమే చరణ్ పెళ్లి చేసుకున్నారన్నారు… సంచలన వ్యాఖ్యలు చేసిన ఉపాసన!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీ కపుల్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో ఉపాసన(Upasana) రాంచరణ్ (Ramcharan) దంపతులు ఒకరు అని చెప్పాలి.

ఇండస్ట్రీలో రాంచరణ్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ సాధించగా ఉపాసన బిజినెస్ ఉమెన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ఇక రామ్ చరణ్ ఉపాసన దంపతుల 10 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నారు.

ఇక ఈ దంపతులు త్వరలోనే తల్లిదండ్రులుగా మారబోతున్న విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే బుల్లి మెగా వారసుడు ఎప్పుడు రాబోతున్నారా అని అభిమానులతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

"""/" / ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఉపాసన పెళ్లి తర్వాత మొదట్లో తన గురించి వచ్చినటువంటి విమర్శల గురించి మాట్లాడారు.

ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా తాను చరణ్ ఇద్దరు కలిసామని తెలిపారు.

ఇలా ఏర్పడిన మా స్నేహం ప్రేమగా మారింది.అయితే మా రెండు కుటుంబాలు విభిన్న నేపథ్యంలో కొనసాగుతున్నాయి.

అయితే ఒకరిపై ఒకరికున్న నమ్మకంతో మా కుటుంబాలు కూడా మా పెళ్ళికి ఒప్పుకున్నాయని ఉపాసన తెలిపారు.

"""/" / ఇక చిన్నప్పటినుంచి తనని ఏదో ఒక విషయంలో ఇతరులు తనని జడ్జి చేసేవారని ఈమె తెలిపారు.

అయితే ప్రతి ఒక్కరు ఇలాంటి విమర్శలు ఎదుర్కొంటూనే ఉంటారని ఉపాసన తెలిపారు.ఇక పెళ్లయిన కొత్తలో తనని చాలామంది బాడీ షేమింగ్ ట్రోల్స్ చేశారని తెలిపారు.

నేను చాలా లావుగా ఉన్నానని అందంగా లేనని తనని ట్రోల్ చేశారని అదే విధంగా మరికొందరు కేవలం చరణ్ నా డబ్బు చూసి డబ్బు కోసమే నన్ను పెళ్లి చేసుకున్నారు అంటూ తనపై విమర్శలు కూడా చేశారని ఈమె తెలిపారు.

అయితే ఆ మాటలు విని నేను కృంగిపోలేదు ధైర్యంతో ముందుకు నడిచాను.అయితే అప్పుడు నన్ను విమర్శించిన వాళ్లే ఇప్పుడు ప్రశంసిస్తున్నారు అంటూ ఈ సందర్భంగా ఉపాసన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం ఆంధ్ర లెక్కలివే.. ఏ సినిమాకు ఎంతంటే?