నేడే ఉపాసన డిశ్చార్జ్… మెగా ఇంట్లోకి అడుగుపెట్టబోతున్న వారసురాలు?

మెగా కోడలు ఉపాసన( Upasana Konidela ) జూన్ 20వ తేదీ మంగళవారం అపోలో హాస్పిటల్లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం మనకు తెలిసిందే.

ఈ విధంగా ఉపాసన పాపాయికి( Baby Girl ) జన్మనిచ్చారనే విషయం తెలియడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

కూతురు జన్మించడంతో మెగా అభిమానులు అందరూ కూడా సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా మెగా కుటుంబ సభ్యులందరూ అపోలో హాస్పిటల్ కి చేరుకొని మెగా ప్రిన్సెస్ ని చూసి సంబరపడ్డారు.

అయితే ఇప్పటివరకు మెగా ప్రిన్సెస్ ఫోటోని మాత్రం బయటకు రివిల్ చేయలేదు. """/" / మెగా ప్రిన్సెస్( Mega Princess Photo ) తానే అంటూ ఓ చిన్నారి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే అది నిజమైన మెగా ప్రిన్సెస్ ఫోటో కాదని అది ఫేక్ అంటూ మెగా ఫ్యామిలీకి చెందిన అత్యంత సన్నిహితులు వెల్లడించారు.

ఇక ఉపాసన పాపకు జన్మనిచ్చి మూడు రోజుల కావడంతో నేడు మధ్యాహ్నం ఉపాసన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ ( Upasana Discharge ) కాబోతున్నారని తెలుస్తోంది.

గత మూడు రోజుల నుంచి వైద్యుల పర్యవేక్షణలో ఉన్నటువంటి ఉపాసన, తన బిడ్డ ఇద్దరు చాలా ఆరోగ్యంగా(Healthy) ఉన్నారని అపోలో వైద్యులు వెల్లడించారు.

"""/" / ఇలా తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉండడంతో వీరిని నేడు మధ్యాహ్నం డిస్టర్బ్ చేయడానికి సిద్ధమయ్యారు.

ఇప్పటికే డిశ్చార్జికు సంబంధించిన ఫార్మాలిటీస్ అన్ని కూడా పూర్తి అయ్యాయని తెలుస్తుంది.ఈ క్రమంలోనే ఈ విషయం తెలియడంతో నేడు రామ్ చరణ్ ( Ram Charan ) ఉపాసన దంపతులు మీడియా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని రామ్ చరణ్ మీడియాతో మాట్లాడుతూ తన బిడ్డ ఫోటోలను కూడా రివీల్ చేసే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.

ఉపాసన డిశ్చార్జ్ కావడంతో మొదటిసారి మెగా వారసురాలు తమ ఇంట్లోకి అడుగుపెట్టబోతుందని మెగా ప్రిన్సెస్ కు మెగా ఫ్యామిలీ గ్రాండ్ గా వెల్కమ్ చెప్పబోతున్నారని తెలుస్తుంది.

తెలివితేటల్లో ఐన్‌స్టీన్‌నే మించిపోయిన భారత సంతతి బాలుడు.. వయసు పదేళ్లే!