చరణ్ మైనపు విగ్రహావిష్కరణకు ముహూర్తం ఫిక్స్… ఎప్పుడంటే? 

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు లాంటి హీరోల మైనపు విగ్రహాలను ఇప్పటికే మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ( Madame Tussauds Museum ) ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసిందే.

అయితే తాజాగా ఈ మ్యూజియంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ( Ram Charan Tej ) మైనపు విగ్రహాన్ని(Wax Statue) కూడా ఏర్పాటు చేయబోతున్నారు ఇప్పటికే ఈ విగ్రహా తయారీ కూడా పూర్తి అయ్యిందని తెలుస్తోంది .

"""/" / లండన్ లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ తో పాటు తన పెట్ రైమ్( Rhym ) విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు.

ఇప్పటికే వీరి కొలతలను కూడా తీసుకోవటం విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది.

ఈ మ్యూజియంలో సినిమా, స్పోర్ట్స్‌తో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖుల మైనపు విగ్రహాలు టుస్సాడ్స్‌ మ్యూజియంలో ఉంటాయి.

బాలీవుడ్‌ నుంచి అమితాబ్‌ బచ్చన్‌, రణ్‌బీర్‌ కపూర్‌, ఐశ్వర్యరాయ్‌, షారుక్‌ ఖాన్‌ మైనపు విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి.

"""/" / ఇక పోతే రామ్ చరణ్ మైనపు విగ్రహావిష్కరణకు కూడా ముహూర్తం ఫిక్స్ చేశారని తెలుస్తుంది.

మే 9 వ తేదీ ఈ విగ్రహావిష్కరణ ఉండబోతుందని టుస్సాడ్స్‌ మ్యూజియం వెల్లడించింది.

ఈ మైనపు విగ్రహాన్ని లండన్ మ్యూజియంలో లాంచ్ చేసి అనంతరం సింగపూర్ టుస్సాడ్స్ మ్యూజియానికి తరలిస్తారు.

ఇక ఈ విషయం తెలియడంతో మెగా అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక చరణ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈయన బుచ్చిబాబు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న పెద్ది సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో బిజీ కాబోతున్నారు.ఈ సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.