క్లారిటీ కోరుతున్న చరణ్.. ఏ విషయంలో అంటే!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాను అక్టోబర్ నెలలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.కానీ కరోనా కారణంగా మరోసారి ఈ సినిమా రిలీజ్ వాయిదా పడనుంది.

దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

కాగా ఈ సినిమా రిలీజ్ కాకముందే చరణ్ తన నెక్ట్స్ మూవీని స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించాడు.

ఇక ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌తో ఒక్కసారిగా అందరి చూపులు ఈ కాంబోపై పడ్డాయి.

ఈ సినిమా ఎలాంటి కథతో వస్తుందా, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే దర్శకుడు శంకర్ చిత్రాలు పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది.ఇప్పటికే స్టార్ హీరో కమల్ హాసన్‌తో ఇండియన్-2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్న శంకర్, ఇంకా ఆ సినిమాకు సంబంధించి మెజారిటీ షూటింగ్‌ను పూర్తి చేయాలి.

దీంతో చరణ్‌తో సినిమాను ఆయన ఎప్పుడు ప్రారంభిస్తాడా అనే సందేహం అందిరలో నెలకొంది.

అయితే ఈ విషయంపై అటు చరణ్ కూడా క్లారిటీ కావాలంటున్నాడు.ఆర్ఆర్ఆర్ చిత్రం పూర్తవ్వగానే శంకర్ సినిమాలో జాయిన్ అవ్వడం కానీ పని అని చరణ్ భావిస్తున్నాడు.

దీంతో ఇండియన్-2 చిత్రాన్ని ఎప్పటికల్లా పూర్తి చేస్తాడో శంకర్ తనకు క్లారిటీ ఇస్తే, ఈ గ్యాప్‌లో మరో డైరెక్టర్‌ను ఫిక్స్ చేసుకోవాలని చరణ్ చూస్తున్నాడు.

ఈ లెక్కన శంకర్-చరణ్ కాంబో సినిమా కంటే ముందే మరో డైరెక్టర్‌తో సినిమా చేసి రిలీజ్ చేయాలని చరణ్ ప్లాన్ చేస్తున్నాడు.

మరి చరణ్‌కు కావాల్సిన క్లారిటీ ఎప్పుడు దొరుకుతుందో అని ఆయన అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఆర్ఆర్ఆర్ చిత్రంలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.