రామ్ చరణ్ దర్గాకు వెళ్లడంపై తనికెళ్ల భరణి రియాక్షన్ ఇదే.. ఆయన ఏమన్నారంటే?

టాలీవుడ్ మెగా హీరో రామ్ చరణ్ ( Mega Hero Ram Charan )గురించి మనందరికీ తెలిసిందే.

రామ్ చరణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు.ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ మూవీలో( Game Changer Movie ) నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇకపోతే రెండు రోజులుగా చెర్రీ పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న విషయం తెలిసిందే.

అందుకు గల కారణం కూడా లేకపోలేదు.అయ్యప్ప మాలలో ఉన్న రాంచరణ్ తాజాగా కడపలోని అమీర్ దర్గాను ( Ameer Dargah )సందర్శించారు.

"""/" / అయ్యప్ప స్వామి మనలో ఉన్నప్పటికీ దర్గాను సందర్శించడం పట్ల కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయంపై ఇప్పటికే ఆయనకు మద్దతుగా నిలుస్తూ ఉపాసన సోషల్ మీడియాలో ఒక స్ట్రాంగ్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

పవిత్రమైన అయ్యప్ప స్వామి మాల వేసుకుని.దర్గాకు వెళ్లడం సరైంది కాదని కొందరు అంటున్నారు.

అయితే దీనిపై ఆధ్యాత్మిక గురూజీ రాధా మనోహర్ దాస్ స్పందించి.రామ్ చరణ్ చేసిన దాంట్లో తప్పేంలేదని తేల్చి చెప్పారు.

ఇకపోతే తాజాగా మతం అంటే కలిపేది విడదీసేది కాదంటూ తనికెళ్ల భరణి ఒక సినిమాలో చేసిన కామెంట్స్‌కు రామ్ చరణ్ దర్గాను దర్శించుకున్న ఫొటోలు సింక్ చేసి పలువురు జనాలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

"""/" / తనికెళ్ల భరణి కామెంట్స్ చూసినట్లైతే.41 రోజులు నిష్ఠగా మాల వేసుకునే అయ్యప్ప స్వామి భక్తులు ముందుగా వెళ్లేది బాబర్ స్వామి మసీద్‌కు(Babar Swami Masjid ).

మతం అంటే కలిపేది విడదీసేది కాదు.ఇప్పేడేమిటి ఎన్నో శతబ్దాలుగా ఇక్కడ హిందువులు ముస్లింలు కలిసే ఉంటున్నారు.

బీబీ నాంచరమ్మను ఆ ఏడు కొండలవారు పెళ్లి చేసుకున్నారని, కడపలోని ముస్లింలు వెంకటేశ్వర స్వామిని తన ఇంటి అల్లుడిగా భావించి పూజలు చేశారు.

వేములవాడ శివాలయం లోపల ఒక దర్గా ఉంది.శివ భక్తుల్ని ముస్లిం మత పెద్దలు ఆశీర్వదించే అపూర్వ దృశ్యం మనం అక్కడ చూడచ్చు.

చార్మినార్ లో ఒక బినార్ కింద సాక్షాత్తు అమ్మవారి దేవాలయం ఉంది.అక్కడ అమ్మవారికి లక్ష్మీ పూజ చేసి దీపావళి కాంతులతో వెలిగిపోతుందంటూ తనికెళ్ల భరణి ఎంతో గొప్పగా వివరించిన తీరు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

హమాస్ చెరలో 19 ఏళ్ల సైనికురాలు.. ఆమె మాటలు వింటుంటే గుండె తరుక్కుపోతుంది!