రామ్ చరణ్ డిజాస్టర్ సినిమా అక్కడ సూపర్ హిట్

రామ్ చరణ్ కెరియర్ లో ఆరెంజ్ సినిమా తర్వాత ఆ స్థాయిలో డిజాస్టర్ మూవీగా మారిన సినిమా వినయ విదేయ రామా.

బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రామ్ చరణ్ అన్నలకి అండగా ఉండే తమ్ముడుగా నటించాడు.

ఇక ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలలో ఓవర్ యాక్షన్, అలాగే స్క్రీన్ ప్లే సరైన విధంగా లేకపోవడం ప్రేక్షకులు తిప్పి కొట్టారు.

చరణ్ కెరియర్ లో అత్యంత చెత్త సినిమాగా ఇది నిలిచిపోయింది.ఇక బోయపాటి కెరియర్ లో కూడా బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీ ఇదే కావడం విశేషం.

ఈ సినిమా ఎఫెక్ట్ బోయపాటి మీద ఇప్పటికి ఉంది.అయితే బిగ్ స్క్రీన్ మీద డిజాస్టర్ అయిన ఈ సినిమా స్మాల్ స్క్రీన్ మీద మాత్రం మంచి రేటింగ్స్ సొంతం చేసుకుంది.

రామ్ చరణ్ కెరియర్ లో హిట్ సినిమా అయిన దృవ సినిమా కంటే ఎక్కువ రేటింగ్ వినయ విదేయ రామా సినిమాకే వచ్చింది.

మొదటి సారి సినిమాని టెలికాస్ట్ చేసినపుడు 7.53 రేటింగ్ సొంతం చేసుకున్న ఈ సినిమా తాజాగా మళ్ళీ మాస్టార్ లో ఈ సినిమా టెలికాస్ట్ చేయగా ఏకంగా 8 రేటింగ్ వచ్చింది.

లాక్ డౌన్ సమయంలో టీవీలో ఎలాంటి సినిమా వేసిన ప్రేక్షకులు చూస్తున్నారు.ఈ నేపధ్యంలోనే వినయ విదేయ రామాకి మొదటి సారి కంటే రెండో సారి ఎక్కువ రేటింగ్ వచ్చిందని చెప్పొచ్చు.

మొత్తానికి చరణ్ హిట్ సినిమాకంటే ఫ్లాప్ సినిమా టెలివిజన్ పై సూపర్ హిట్ కావడం విశేషం అని చెప్పాలి.

కార్తీ లడ్డు వివాదం పై మరోసారి రియాక్ట్ అయిన పవన్ కళ్యాణ్.. ఏమన్నారంటే?