వైరల్ పిక్.. అల్ట్రా స్టైలిష్ లుక్ లో చరణ్.. ట్రెండ్ సెట్ చేస్తున్నాడుగా!

ఈ మధ్య మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సరికొత్తగా మేకోవర్ అయ్యి అభిమానులకు కొత్త ఫ్యాషన్ ను పరిచయం చేస్తున్నాడు.

ఎప్పటికప్పుడు కొత్త లుక్ తో కనిపిస్తున్నాడు .ఈ మధ్య చరణ్ బయట ఎప్పుడు కనిపించిన మోడ్రన్ లుక్ తో ట్రెండ్ సెట్ చేస్తున్నాడు.

ఇక తాజాగా మరొకసారి చరణ్ కొత్త లుక్ తో స్టైలిష్ గా కనిపించాడు.

ఈ ఫోటోలు ప్రసెంట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.చరణ్ ఇండో వెస్ట్రన్ లుక్ తో కనిపించి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయాడు.

గ్రీన్ కలర్ కుర్తా తో బ్లాక్ కలర్ ప్యాంట్ తో దేశీ లుక్ లో కనిపించాడు.

బ్లాక్ ఫార్మల్ షూతో కూల్ సన్ గ్లాసెస్ తో అల్ట్రా స్టైలిష్ గా రెడీ అయ్యి ఫోటోలకు ఫోజులిచ్చాడు.

ఈ పిక్స్ ఇప్పుడు సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.ఇక చరణ్ సినిమాల విషయానికి వస్తే ఆయన 'ఆర్ఆర్ఆర్' సినిమా షూటింగ్ పూర్తి చేసి విడుదల సిద్ధంగా ఉంచాడు.

"""/" / మరో పక్క తన తండ్రి చిరంజీవి ఆచార్య సినిమాలో కూడా రామ్ చరణ్ నటిస్తున్నాడు.

ఈ సినిమా కూడా షూటింగ్ పూర్తి చేసుకుంది.ఈ రెండు సినిమాలు కూడా వచ్చే ఏడాది విడుదల కాబోతున్నాయి.

ఆర్ఆర్ఆర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7న రిలీజ్ చేయబోతున్నారు.ఇక చిరంజీవి, రామ్ చరణ్ మల్టీ స్టారర్ సినిమా కూడా ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

"""/" / ఇక రామ్ చరణ్ గ్యాప్ లేకుండా తన తర్వాత ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేసాడు.

లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో RC15' అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా ప్రసెంట్ షూటింగ్ జరుపుకుంటుంది.

ఇటీవలే ముంబైలో ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకున్నారు.ఇక త్వరలోనే ఇక్కడ కూడా షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు.

ఇక ఈ సినిమాలో చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తుంది.

వీడియో: ఇన్‌స్టా రీల్స్‌ విషయంలో గొడవ.. రోడ్డు మీద కొట్టుకున్న యువతులు..